జానీ మాస్ట‌ర్ బెయిల్ పిటీష‌న్ విచార‌ణ వాయిదా!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను రంగారెడ్డి జిల్లా కోర్టు వచ్చే నెల అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.

Update: 2024-09-30 10:06 GMT

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను రంగారెడ్డి జిల్లా కోర్టు వచ్చే నెల అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నార్సింగి పోలీసులు... రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేశారు.

జానీ మాస్టర్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని కౌంటర్‌లో పోలీసులు పేర్కొన్నారు. విచారణ సమయంలో బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరారు. ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది.

అసిస్టెంట్ మ‌హిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించారు. ఇప్పటికే జానీ పోలీసుల‌కు కీల‌క విష‌యాలు రాబట్టారు. ఇలాంటి సమయంలో బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరిన‌ట్లు తెలుస్తోంది.

అక్టోబ‌ర్ 4 వ‌ర‌కూ జానీ మాస్ట‌ర్ కి రిమాండ్ విధించిన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ ఆ తేదీన జానీని కోర్టులో ప్ర‌వేశ పెట్టే అవ‌కాశం ఉంది. జస్టిస్ హేమ క‌మిటీ నివేదిక మాలీవుడ్ ని కుదిపేసిన వేళ‌..దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన స‌మ‌యంలో జానీ మాస్ట‌ర్ అత్యారారం ఆరోప‌ణ వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. దీంతో టాలీవుడ్ లోనూ హేమ క‌మిటీ లాంటింది రావాల‌ని డిమాండ్ వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి సంబంధించి శాశ్వ‌త ప‌రిష్కార క‌మిటీ వేయాల‌ని ప‌రిశ్ర‌మ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

Tags:    

Similar News