మన సెమీ కండక్టర్ల ఆకలి తీరేందుకు జపాన్ రెఢీ!

భారత్ లో సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ డెవలప్ మెంట్ కు చేతులు కలిపిన వాటిల్లో అమెరికా తర్వాత రెండో క్వాడ్ భాగస్వామి జపాన్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తుననారు.

Update: 2024-12-04 07:30 GMT

ఇవాల్టి రోజున ఎలక్ట్రానిక్స్ రంగంలో సెమీ కండక్టర్ల పాత్ర గురించి తెలిసిందే. అది చిన్న వస్తువైనా.. పెద్ద వస్తువు అయినా సెమీ కండక్టర్ల చుట్టూనే తిరుగుతోంది. అన్నింటికి మించిన విషాదం ఏమంటే.. సెమీ కండక్టర్ల అవసరాల కోసం భారత్.. నిత్యం ఇతర దేశాల మీదనే ఆధారపడే పరిస్థితి. వీటి దిగుమతుల విషయంలో చోటు చేసుకునే ఆలస్యం పలు సందర్భాల్లో దేశ ఆర్థిక వ్యవస్థను సైతం ప్రభావితం చేస్తోంది. ఇలాంటి వేళ.. తాజాగా ఈ రంగంలో తోపుగా పేర్కొనే జపాన్ కంపెనీలు మన దేశంలో యూనిట్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

దీనికి సంబంధించిన ఆసక్తికర అంశాల్ని డెలాయిట్ సంస్థ వెల్లడించింది. సెమీ కండక్టర్ల తయారీలోజపాన్ కంపెనీలకు ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయని.. ఆ సంస్థలు భారత్ లో పార్టనర్ షిప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు.. నిధుల లభ్యత.. ప్రభుత్వంనుంచి మద్దతుతో భారత్ ను ఈ రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు జపాన్ సంస్థు సానుకూలంగా ఉన్నట్లుగా డెలాయిట్ పేర్కొంది.

భారత్ లో సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ డెవలప్ మెంట్ కు చేతులు కలిపిన వాటిల్లో అమెరికా తర్వాత రెండో క్వాడ్ భాగస్వామి జపాన్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తుననారు. వంద సెమీ కండక్టర్ ఫ్లాంట్లతో సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ కలిగిన టాప్ 5 దేశాల్లో జపాన్ ఒకటన్న విషయాన్ని డెలాయిట్ వెల్లడించింది.

చిప్ ల తయారీలో వాడే వేఫర్లు.. కెమికల్ గ్యాస్.. లెన్స్ ల తయారీలో జపాన్ అత్యున్నత స్థానంలో ఉన్నట్లుగా పేర్కొన్న డెలాయిట్.. పదేళ్ల వ్యవధిలో భారత్ లో పది సెమీ కండక్టర్ కంపెనీల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. ఏదో ఒక ఫ్యాక్టరీ ఏర్పాటుతో సెమీ కండక్టర్ లక్ష్యం నెరవేరదని.. మొత్తం ఎకో సిస్టమ్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని డెలాయిట్ చెబుతోంది. మరి.. దీనికి సానుకూలంగా స్పందించేందుకు భారత కంపెనీలు ఏవి ముందుకు వస్తాయో చూడాలి.

Tags:    

Similar News