విశాఖలో జైషా, లోకేష్ సందడి... ఈ బాండింగ్ వేరే లెవెల్!
విశాఖపట్నంలో ఐసీసీ ఛైర్మన్ జైషా, ఏపీ మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. అంతకముందు విశాఖపట్నంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ స్టేడియం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.;

విశాఖపట్నంలో ఐసీసీ ఛైర్మన్ జైషా, ఏపీ మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. ఆదివారం విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ను వీక్షించారు. ఈ సందర్భంగా... లోకేష్ - జైషా మధ్య బాండింగ్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ బాండింగ్ రాష్ట్రానికి చాలా మంచిదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... విశాఖపట్నంలో ఐసీసీ ఛైర్మన్ జైషా, ఏపీ మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. అంతకముందు విశాఖపట్నంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ స్టేడియం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఐసీసీ ఛైర్మన్ జైషా, మంత్రి నారా లోకేష్ ఈ పనులు శిలాపలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సమయంలో.. సుమారు రూ.35 కోట్లతో స్టేడియాన్ని ఆధునీకరిస్తున్న పనులు వేగంగా జరుగుతున్నాయి. మ్యాచ్ అనంతరం మంత్రి లోకేష్, జైషా కలిసి ఫుడ్ కోర్టులో సరదాగా గడిపారు. ఈ సమయంలో జైషా నగరంలో స్ట్రీట్ ఫుడ్ తినాలని కోరుకోవడంతో లోకేష్ ఆ ఏర్పాట్లు చేయించారని అంటున్నారు.
ఈ సందర్భంగా.. వీళ్లిద్దరి మధ్య బాండింగ్ చర్చనీయాంశంగా మారింది. ఈ బాండింగ్ రాష్ట్రానికి పలు మేలులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాగా.. ఇటీవల జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ – పాక్ మధ్య మ్యాచ్ ను తిలకించేందుకు జైషా, లోకేష్ ఇద్దరూ దుబాయ్ లోనూ కలిసిన సంగతి తెలిసిందే.
మరోపక్క ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు కేశినేని శివనాథ్ స్పందిస్తూ.. విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని.. ఐపీఎల్ మ్యాచ్ ల వల్ల పనుల్లో కాస్త ఆలస్యం జరిగిందని.. త్వరలోనే ఆ పనులు పూర్తి చేస్తామని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని మ్యాచ్ లు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.