తమిళనాడుకు జయలలిత ఖజానా.. తెరపైకి కళ్లు చెదిరే లెక్కలు!
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల విషయం మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల విషయం మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆమె ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో వాటిని అప్పగించాలని న్యాయమూర్తి హెచ్.ఎ.మోహన్ అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరులోని కోర్టు అధికరులు తాజాగా అప్పగించారు. బెంగళూరు పరప్పన అగ్రహార కారగారంలో ఇప్పటివరకూ జయలలిత ఆస్తులు, పత్రాలను భద్రపరచగా.. తాజాగా న్యాయమూర్తి హెచ్.ఎ.మోహన్ సమక్షంలో వాటిని తమిళనాడు అధికారులకు అప్పగించారు.
అవును... దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఆస్తులు, పత్రాలను న్యాయమూర్తి సమక్షంలో తమిళనాడు అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా.. తెరపైకి వచ్చిన ఆస్తులు కళ్లు చెదిరేలా ఉన్నాయని అంటున్నారు.
ఇందులో భాగంగా... 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు.. 601 కిలోల వెండి.. 10,000 చీరలు.. 750 జతల పాదరక్షలు.. 1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు.. నివాసాలకు సంబంధించిన దస్తావేజులు తదితరాలు ఉండగా... వాటిని భారీ భద్రత నడుమ తీసుకెళ్లేందుకు అధికారులు ఆరు ట్రంకు పెట్టేలు తీసుకొచ్చారట.
కాగా... జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటక రాష్ట్రానికి బదిలీ అయిన సంగతి తెలిసిందే. దీంతో.. నాడు తమిళనాడులో జప్తు చేసిన ఆస్తులు, పత్రాలకు కర్ణాటకకు తీసుకొచ్చి భద్రపరిచారు. ఈ సమయంలో.. తాము జయలలిత వారసులమని జే దీపక్, జే దీప అనే వ్యక్తులు పిటిషన్ వేశారు.
దీంతో.. ఆ ఆస్తులను తమకే అప్పగించాలని వారిరువురూ వేసుకున్న పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడి ధర్మాసనం కూడా ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈ సందర్భంగా... జయలలితకు సంబంధించిన ఆస్తులు, పత్రాలు అన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికి ప్రత్యేక న్యాయస్థానం అప్పగించింది.
కాగా.. జప్తు చేసుకున్న సమయంలో ఆమె ఆస్తుల విలువను అధికారులు రు.913.14 కోట్లుగా అధికారులు మదింపు వేయగా.. వాటి విలువ నేడు కనీసం రూ.4,000 కోట్లుగా ఉండొచ్చని తెలుస్తోంది.