ఓవల్ ఆఫీసులో వాన్స్ "వావ్"... ట్రంప్ గైడ్ గా మారిన వీడియో వైరల్!
తాజాగా వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వాన్స్ వైట్ హౌస్ లో కార్యాలయాన్ని చుసినప్పుడు అదే అనుభూతిని పొందారు!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో వైస్ ప్రెసిడెంట్ గా జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆ హోదాలో తొలిసారిగా అమెరికా ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ కి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అవును... జీవితంలో ఎంత ఎదిగినా, ఎంత ఉన్నత శిఖరాలను అధిరోహించినా.. కొన్ని విషయాలు మాత్రం లైఫ్ లో "వావ్" మూమెంట్ ని కలిగిస్తుంటాయి. జీవితంలో ఎన్నో అద్భుతాలు ఉన్నా.. వాటిలో కొన్నింటికి మరీ ప్రత్యేతకత ఉంటుంది. తాజాగా వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వాన్స్ వైట్ హౌస్ లో కార్యాలయాన్ని చుసినప్పుడు అదే అనుభూతిని పొందారు!
దీనికి సంబంధించిన వీడియోను స్పీకర్ మైక్ జాన్సన్ తన ‘ఎక్స్’ వేదికగా వెళ్లడించారు. ఈ సందర్భంగా అమెరికాలో మాత్రమే కష్టపడి పనిచేసే యువకుడు తన నిరాడంబర పరిస్థితుల నుంచి పైకి లేచి యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఓవల్ లోకి ప్రవేశించగలడు అని క్యాప్షన్ రాసి పెట్టారు! దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.
వాస్తవానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ రిపబ్లికన్ నాయకుల ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం వైట్ హౌస్ వద్ద వారితో ముచ్చటిస్తుననరు. ఆ సమయంలో.. ఇంతకు ముందు తాను ఓవల్ కార్యాలయాన్ని సందర్శించలేదు అని డొనాల్డ్ ట్రంప్ తో జేడీ వాన్స్ పేర్కొన్నారని మైక్ జాన్సన్ తెలిపారు.
ఈ సమయంలో వాన్స్ ను వెంటపెట్టుకుని ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ ఆఫీసుకు బయలుదేరారు.. అప్పుడు “నేను ఈ క్షణాన్ని వీడియో తీయాలని అనుకుంటున్నాను” అని వాన్స్ కు ట్రంప్ కు చెప్పానని జాన్సన్ తెలిపారు. ఈ వీడియోలో ట్రంప్ వెనుక వాన్స్ ఓవల్ ఆఫీసు వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. ట్రంప్ గైడ్ చేస్తూ కనిపించారు.
ఈ సమయంలో ట్రంప్ తన ఆఫీసు ఎంట్రన్స్ వద్ద ఆగి.. లోపలికి రమ్మని వాన్స్ కు సైగ చేశారు. దీంతో... తొలిసారిగా ఓవల్ ఆఫీసులోకి వెళ్లిన వాన్స్.. "వావ్" అంటూ లోపలికి అడుగుపెట్టి అరవడం మొదలుపెట్టారు. గది చుట్టూ చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైనట్లు కనిపించారు... ఇది అద్భుతం అని అంగీకరించారు. ఈ వీడియో వైరల్ గా మారింది.