అమెజాన్ అధినేత లవ్వర్ అన్న తర్వాత ఆ మాత్రం ఉండదా?
ప్రేయసికి ఇచ్చే బహుమతి ఒక్కొక్కరు ఒక్కోలా ప్రదర్శిస్తారు. మరి.. అమెజాన్ అధినేత అయితే? ఆయన కూడా మిగిలిన వారి మాదిరే.;
ప్రేయసికి ఇచ్చే బహుమతి ఒక్కొక్కరు ఒక్కోలా ప్రదర్శిస్తారు. మరి.. అమెజాన్ అధినేత అయితే? ఆయన కూడా మిగిలిన వారి మాదిరే. కాకుంటే.. మిగిలిన వారితో పోలిస్తే ఆయనకున్న వేలాది కోట్ల ఆస్తుల నేపథ్యంలో.. ఆ స్థాయికి ఏ మాత్రం తగ్గని రీతిలో ఆయన బహుమతులు ఉంటాయి. ఇదంతా ఎందుకుంటే.. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ప్రియురాలు కం కాబోయే భార్య త్వరలో అంతరిక్షయాత్రకు వెళ్లనున్నారు.
అమెజాన్ అధినేతకు చెందిన మరో సంస్థ బ్లూ ఆరిజిన్. ఈ సంస్థ ప్రైవేటు అంతరిక్ష యాత్రల్ని నిర్వహిస్తోంది. మార్చి - జూన్ మధ్యలో రోదసి యాత్రకు ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ యాత్రలో తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ పాల్గొంటారు. ఎన్ఎస్ 31 మిషన్ పేరుతో నిర్వహించే ఈ యాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమంటే.. ఈ యాత్రలో పాల్గొనే టూరిస్టులు అందరూ కూడా మహిళలే.
ఈ రోదసి యాత్రకు పలువురు మహిళా ప్రముఖులు వెళ్లనున్నారు. ఈ జాబితాలో పాప్ సింగర్ కేటీ పెర్రీ.. సీబీసీ న్యూస్ యాంకర్ గైలీ కింగ్.. పౌరహక్కుల కార్యకర్త అమందా గుయెన్.. సినీ నిర్మాత కెరియన్ ప్లెన్.. నాసా మాజీ సైంటిస్టు ఐషా బోవె లు ఉన్నారు. వీరు ప్రయాణించనున్న వ్యోమనౌక ‘న్యూ షెపర్డ్’గా పేర్కొన్నారు. సాధారణ ప్రజల మాదిరే అత్యంత సంపన్నులకు కూడా ఖరీదైన కోరికలు ఉంటాయి. అవెలా ఉంటాయన్న దానికి నిదర్శనంగా ఈ రోదసి యాత్ర నిలుస్తుందని చెప్పాలి.