బహిరంగంగానే బైడెన్ 'ముద్దు ముచ్చట'.. అడ్డుకున్న భార్య జిల్

మరో దేశాధినేత కల్పించుకుని ఆయనను కెమెరా వైపు చూసేలా చేశారు.

Update: 2024-07-19 10:33 GMT

అది జి7 దేశాల కూటమి సమావేశం.. ప్రపంచంలోని శక్తమంతమైన దేశాల అధినేతలు పాల్గొనే ఈ సమావేశంలో గ్రూప్ ఫొటోకు పోజివ్వాల్సిన సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎటో తిరిగి చూస్తున్నారు. మరో దేశాధినేత కల్పించుకుని ఆయనను కెమెరా వైపు చూసేలా చేశారు.

అది నాటో కూటమి.. అమెరికా పెద్దన్నగా వ్యవహరించే సైనిక కూటమి.. రష్యాపై దాదాపు రెండేళ్లుగా పరోక్ష యుద్ధం చేస్తోంది. అలాంటి కూటమి సమావేశంలో బైడెన్ ఏకంగా ట్రంప్ ను తమ ఉపాధ్యక్షుడు అని సంబోధించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అని విలేకరుల సమావేశంలోనే ప్రస్తావించారు. ఇలాంటివి ఎన్నో ఉదంతాలు ఇటీవలి కాలంలో బైడెన్ గురించి బయటకు వచ్చాయి. అలాంటిదే మరో ఘటన ఇది..

అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచాన్ని శాసించేవాడు. అత్యంత పవర్ ఫుల్ అయిన అలాంటి పీఠం కోసం బైడెన్ మరోసారి పోటీ పడుతున్నారు. అయితే, ఆయన చేష్టలు, అనారోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలనే డిమాండ్లు వస్తున్నాయి. సొంత పార్టీ డెమోక్రాట్లే ఈ డిమాండ్ ను లేవెనెత్తుతున్నారు.

బహిరంగ వేదికపైనే..

మీడియా సమావేశాల్లో, దేశాధినేతల సదస్సుల్లోనే కాదు.. బహిరంగ వేదికలపైనా తన వింత ప్రవర్తనతో కలకలం రేపుతున్నారు. ఇటీవల ఓ సమావేశంలో స్తంభించిపోయారు. మరోసారి దారితప్పారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన మరో ఉదంతంలో బైడెన్‌ ఓ మహిళను ముద్దు పెట్టుకోబోయారు. అయితే, ఈ ఘటన కొన్నేళ్ల కిందటిదా? ఇటీవల జరిగిందా? అనేది మాత్రం తెలియరాలేదు. ఓ కార్యక్రమంలో వైదికపై ఉన్న మహిళతో మాట్లాడుతూ బైడెన్‌ ఉన్నట్టుండి ఆమెకు దగ్గరగా వెళ్లారు. కాస్తయితే ముద్దు పెట్టుసేవారే..? కానీ.. దీనిని బైడెన్ భార్య జిల్ గమనించారు. వెంటనే తన భర్తను నిలువరించారు. ఇక బైడెన్ భద్రతా సిబ్బంది మహిళను పంపించేశారు.

ఎవరు చేస్తున్నారు ఇదంతా?

బైడెన్ తడబాటు వివిధ కార్యక్రమాల సందర్భంగా లైవ్ లో అందరూ చూసినదే. అయితే, బయటపడని కొన్ని వీడియోలను ఎన్నికల సమయంలో ఎవరో ఉద్దేశపూర్వకంగా విడుదల చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది సహజంగానే ఆయనపై వ్యతిరేకతకు కారణం అవుతాయి. అయితే, అనారోగ్య సమస్యలున్న బైడెన్ కొవిడ్ బారిన కూడా పడ్డారు. క్వారంటైన్ నుంచి బయటకు రాగానే తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.

Tags:    

Similar News