'గంభీర్ కోరినా బీసీసీఐ వద్దంది!'... జాంటీ రోడ్స్ 'గోవా' కామెంట్స్ వైరల్!
ఇందులో భాగంగా... బౌలింగ్ కోచ్ గా సౌతాఫ్రికాకు చెందిన మోర్నీ మోర్కల్ ను తీసుకున్నాడు. మరోపక్క ఫీల్డింగ్ కోచ్ గానూ అదే దేశానికి చెందిన జాంటీ రోడ్స్ ను తీసుకుంటాడని వార్తలు వచ్చాయి.
దక్షిణాఫ్రికా క్రికెటర్ జాంటీ రోడ్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. తనదైన మెరుపు ఫీల్డింగ్ విన్యాసాలతో వరల్డ్ లోనే బెస్ట్ ఫీల్డర్ లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఫీల్డింగ్ కోచ్ గా మారాడు. ఈ సమయంలో టీంఇండియాకు ఫీల్డింగ్ కోచ్ గా తనను ఎంపిక చేయలేదంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
అవును... టీంఇండియా కు గౌతం గంభీర్ హెడ్ కోచ్ గా వచ్చిన తర్వాత.. సపోర్టింగ్ స్టాఫ్ ని ఎంపిక చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా... బౌలింగ్ కోచ్ గా సౌతాఫ్రికాకు చెందిన మోర్నీ మోర్కల్ ను తీసుకున్నాడు. మరోపక్క ఫీల్డింగ్ కోచ్ గానూ అదే దేశానికి చెందిన జాంటీ రోడ్స్ ను తీసుకుంటాడని వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ మాత్రం ఈ విషయంలో గంభీర్ ప్రతిపాదనను తిరస్కరించిందని అంటున్నారు.
ఇలా తనను ఫీల్డింగ్ కోచ్ గా గంభీర్ ప్రతిపాదించినట్లు వార్తలు రావడం.. అయితే అందుకు బీసీసీఐ అంగీకరించలేదని కథనాలు రావడంపై జాంటీ రోడ్స్ స్పందించాడు. ఇందులో భాగంగా... తనను గంభీర్ ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయని.. అయినప్పటికీ బీసీసీఐ తిరస్కరించడం నమ్మశక్యంగా లేదని స్పందించిన జాంటీ రోడ్స్.. తనది గోవా అంటూ కామెంట్ చేశారు.
తనను గంభీర్ ప్రతిపాదించినా బీసీసీఐ తిరస్కరించడం ఏమాత్రం నమ్మశక్యంగా లేదని అంటూ.. భారత్ కు ఇంటర్నేషనల్ కోచ్ అవసరం లేదేని వారు భావిస్తున్నట్లున్నారని చెబుతూ... తనదీ గోవా అని, తాను భారత్ కు లోకల్ అని.. తన పేరు జాంటీ రోడ్స్ అని.. ఫీల్డింగ్ కోచ్ గా అవకాశం రాకపోవడం నిరాశగా ఉన్నప్పటికీ.. ఫ్యూచర్ లో ఏమి జరుగుతుందో చూద్దామంటూ ఆసక్తికర కామెంట్లు చేశాడు.
ఈ సందర్భంగా ఇప్పటివరకూ ఫీల్డింగ్ కోచ్ లుగా వ్యవహరించిన దిలీప్, శ్రీధర్ లపై ప్రశంసలు కురిపించిన జాంటీ రోడ్స్... ధోనీ, విరాట్ ల ఫిట్ నెస్ పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఇందులో భాగంగా... ధోని కెప్టెన్సీ నుంచి కొహ్లీ కెప్టెన్సీ వరకూ ఫిట్ నెస్ పై తీవ్రస్థాయిలో కృషి చేశారని.. ఇప్పుడూ అదే కొనసాగుతుందని.. అందుకే ఫీల్డింగ్ లో భారత్ అత్యుత్తమంగా తయారైందని రోడ్స్ వ్యాఖ్యానించాడు.
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ కు జాంటీ రోడ్స్ చాలాకాలం పాటు ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరించిన సంఅతి తెలిసిందే. అనంతరం 2022 సీజన్ కు ముందు లఖ్ నవూ కోచింగ్ స్టాఫ్ లో చేరారు. ఈ క్రమంలో గంభీర్ తో కలిసి లఖ్ నవూ సూపర్ జెయింట్స్ కు రోడ్స్ పనిచేశాడు. అయితే... గంభీర్ రికమండ్ చేసినా తనకు ఫీల్డింగ్ కోచ్ గా అవకాశం రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసాడు!