వికీ లీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే..అతని అరెస్టు, విడుదల వెనుక అసలు స్టోరీ..
అంతేకాదు అతని సొంత దేశమైనా ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు కూడా అతనికి అనుమతి లభించినట్లు తెలుస్తోంది.
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే ఎట్టకేలకు లండన్ బెల్ మార్ష్ జైలు నుంచి విడుదలయ్యారు. అమెరికా గూడచారి చట్టాన్ని ఒలంగించినట్లుగా నేరం ఒప్పుకున్న జూలియన్కు ఒప్పందం లో భాగంగా అమెరికా ప్రభుత్వం బెయిల్ మంజూరు చేసింది. సుమారు 5 సంవత్సరాల తర్వాత అతను మొదటి సారి స్వేచ్ఛ వాయువును పెంచుకున్నారు. అంతేకాదు అతని సొంత దేశమైనా ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు కూడా అతనికి అనుమతి లభించినట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఈ జూలియన్ అసాంజే ఎవరు? ఐదు సంవత్సరాల శిక్ష ఎందుకు అనుభవించాడు? ఇప్పుడు అతనికి బెయిల్ ఎందుకు వచ్చింది? తెలుసుకుందాం పదండి..
52 సంవత్సరాల వయసు ఉన్న జూలియన్ అసాంజే విడుదల గురించి వికీలీక్స్ సంస్థ తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వా మూరా తెలియపరిచింది. ఈ మేరకు ఆ సంస్థ ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది.”బెలా మార్ష్ జైలులో 1901 రోజులు శిక్ష అనుభవించిన జులియన్ అసాంజే ఇప్పుడు స్వేచ్ఛా జీవి. లండన్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జూన్ 24 ఉదయం జూలియన్ అసాంజే విడుదల చేయబడ్డారు. జైలు నుంచి విడుదలైన జూలియన్ స్టాన్డ్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారని” వికీలీక్స్ తమ ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేసింది.
దీంతో పాటుగా జూలియన్ విడుదల కోసం మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు కూడా తెలియజేసింది. అతని విడుదల వెనుక ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థల కృషి కూడా ఉందని వికీలీక్స్ పేర్కొంది. అమెరికా న్యాయవిభాగంతో జరిగిన ఒప్పందం ఇంకా అధికారికంగా ఫైనలైజ్ కాకపోవడంతో పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఈ సంస్థ పేర్కొంది.
అయితే బ్రిటన్ లో కస్టడీలో ఉన్న జూలియన్ అసాంజే.. అమెరికా గూడచర్య చట్టాన్ని ఉల్లంఘించినట్టు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు అతనిపై మోపబడినటువంటి మొత్తం 18 అభియోగాలను కోర్టు ఒకే కేసుగా విచారిస్తోంది. బుధవారం సైపన్ కోర్టు ఎదుట అతను విచారణకు హాజరవుతాడు. అయితే అన్ని నేరాలకు కలిపి అతనికి సుమారు 62 నెలల వరకు శిక్ష విధించనున్నట్లు టాక్. ప్రస్తుతం అతను బ్రిటన్ జైల్ లో గడిపిన శిక్ష కాలాన్ని విధించబోయే శిక్షకాలం నుంచి మినహాయిస్తారని, ఆ తర్వాత అతను ఆస్ట్రేలియా కి కూడా వెళ్లడానికి అనుమతిస్తారని సమాచారం.
చిన్నతనం నుంచే కంప్యూటర్లపై ఆసక్తి కనబరిచిన అసాంజే.. ఆస్ట్రేలియాలోని గొప్ప హాకర్స్ లో ఒకరు. 2006లో వికీలీక్స్ అనే సంస్థను స్థాపించిన అసాంజే..
ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలకు సంబంధించి అమెరికా రక్షణ రంగ రహస్య పత్రాలను విజిల్ బ్లోయర్ వెబ్సైట్ లో విడుదల చేశారు. తన భావ స్వేచ్ఛ ప్రకటన వల్ల ప్రపంచవ్యాప్తంగా ఓ సెలబ్రిటీగా మారి అందరి ప్రశంసలు అందుకుంటున్న జూలియన్ అసాంజే.. అమెరికా పాలిట విలన్ గా తయారయ్యాడు.
2010లో తన సంస్థ ద్వారా జూలియన్ హెలికాప్టర్ నుంచి చిత్రీకరించిన బాగ్దాద్ వైమానిక దాడికి సంబంధించిన వీడియోని విడుదల చేశారు. ఆ తర్వాత వికీలీక్స్ సుమారు 91 వేలకు పైగా ఆఫ్గనిస్తాన్ యుద్ధానికి సంబంధించిన అమెరికన్ రహస్య నివేదికలను విడుదల చేసింది. అక్టోబర్ 2010 లో ఇరాక్ యుద్ధాన్ని వివరిస్తూ నాలుగు లక్షల రహస్య సైనిక ఫైల్స్ ని కూడా వికీలీక్స్ విడుదల చేసింది. ఇలా అతను యుఎస్ రహస్యాలను వెల్లడించి జైలు పాలు అయ్యాడు. ఇన్నాళ్లకు అతనికి స్వేచ్ఛ అంతే అవకాశం కనిపిస్తోంది.