రాజాసింగ్ డిమాండ్ లో న్యాయం.. రేవంత్ అర్జెంట్ గా స్పందించాలి

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వెళుతున్న అయ్యప్ప స్వాములకు కనీస అవసరాలైన తాగునీరు.. పార్కింగ్ సౌకర్యాన్ని తక్షణమే కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

Update: 2023-12-15 04:37 GMT

కీలక డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు బీజేపీ ఎమ్మెల్యే కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసరంగా స్పందించాలని.. రాష్ట్రం కాని రాష్ట్రమైన కేరళకు వెళ్లిన తెలుగువారంతా తీవ్ర ఇక్కట్లకు గురి కావటాన్ని ప్రస్తావించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వెళుతున్న అయ్యప్ప స్వాములకు కనీస అవసరాలైన తాగునీరు.. పార్కింగ్ సౌకర్యాన్ని తక్షణమే కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్టు కావాలని.. కేరళ ముఖ్యమంత్రి విజయన్ తో మాట్లాడాలన్నారు. సీఎం రేవంత్ కు కేరళ ముఖ్యమంత్రి బాగా తెలుసన్న రాజాసింగ్.. కేరళలో ఇబ్బంది పడుతున్న తెలుగు ప్రజలకు అన్నప్రసాదం పంపిణీ చేద్దామని ప్రయత్నిస్తున్నా.. అక్కడి ప్రభుత్వం ససేమిరా అంటోందన్నారు. కేరళ ముఖ్యమత్రి విజయన్ తో రేవంత్ కు మంచి సంబంధాలు ఉన్నాయని.. అందుకే వెంటనే ఆయనతో మాట్లాడాలని కోరారు.

దేశ రాజధాని ఢిల్లీలో మాదిరి కేరళలో కూడా తెలంగాణ భవన్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న రాజాసింగ్ మాటల్లో న్యాయం ఉందని చెప్పాలి. ఈసారి భారీ ఎత్తున అయ్యప్ప స్వాములు చేరుకోవటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వేలాది అయ్యప్ప స్వాములకు అవసరమైన కనీస సౌకర్యాలను కల్పించే విషయంలో కేరళ ముఖ్యమంత్రి విజయన్ చేతులు ఎత్తేయటం చూస్తే.. మరీ ఇంత వైఫల్యమా? అనుకోకుండా ఉండలేని పరిస్థితి. ఇలాంటి వేళ.. రాజాసింగ్ డిమాండ్ పై ముఖ్యమంత్రి రేవంత్ తక్షణమే స్పందిస్తే.. వేలాది మంది తెలుగు భక్తులు కేరళలో ఎదురవుతున్న కష్టాల నుంచి తప్పించుకున్న వారు అవుతారు. మరి రేవంత్ ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News