"పుష్కరాల్లో 29 మంది చనిపోతే చంద్రబాబును అరెస్ట్ చేశారా"?

సినీ నటుడు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన వ్యవహారం రాజకీయంగానూ పెను దుమారానికి దారితీసిందని అంటున్నారు.

Update: 2024-12-13 11:23 GMT

అల్లు అర్జున్ అరెస్ట్ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోపక్క ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో రాజకీయ రంగు పులుముకుందని అంటున్నారు. ఈ అరెస్టులో కచ్చితంగా రేవంత్ రెడ్డి పాత్ర, ప్రమేయం ఉందని బీఆరెస్స్ శ్రేణులు ఆరోపిస్తున్న వేళ.. కేఏ పాల్, లక్ష్మీ పార్వతి విడివిడిగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అవును.. సినీ నటుడు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన వ్యవహారం రాజకీయంగానూ పెను దుమారానికి దారితీసిందని అంటున్నారు. ఈ అరెస్ట్ పై ఇప్పటికే బీఆరెస్స్ నేతలు సీఎం రేవంత్ పై ఫైరవుతున్నారని అంటున్నారు. జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట! అంటూ కేటీఆర్ ఇప్పటికే స్పందించారు.

ఈ నేపథ్యంలో స్పందించిన కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... గోదావరి పుష్కరాల్లో 29 మంది, కందుకూరు బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందిన విషయాన్ని గుర్తు చేసిన కేఏ పాల్!... నాడు వారి మృతులకు కారకులైన చంద్రబాబును అరెస్ట్ చేశారా..? రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. సినిమా వాళ్లకు మరో న్యాయమా..? అని ప్రశ్నించారు.

ఇదే సమయంలో... అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్రబాబు కుట్ర ఉందని.. పుష్కరాల సమయంలో చంద్రబాబు వల్ల ఎంతో మంది చనిపోతే మరి ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? కందుకూరు, గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో జనం చనిపోతే చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని ప్రశ్నించారు వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి!

ఇదే సమయంలో... చంద్రబాబు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టులకు దిగటం సిగ్గుచేటని విమర్శించారు. దీంతో... సరికొత్త చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు నెటిజన్లు.

కాగా... జూలై 14, 2015లో గోదావరి మహా పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. 52 మంది గాయపడిన సంగతి తెలిసిందే!

Tags:    

Similar News