'ఎన్టీఆర్ మరణం, జూనియర్ ప్రమాదంలో కుట్ర?'... కాకాణి సంచలన వ్యాఖ్యలు!

ఈ సందర్భంగా పలు ప్రశ్నలు లేవనెత్తారు.. చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2024-11-02 11:55 GMT

గత కొన్ని రోజులుగా అత్యంత హాట్ టాపిక్ గా నడిచిన జగన్ - షర్మిల ఆస్తుల వ్యవహారంపై చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు పలు రకాల వ్యాఖ్యలు చేస్తున్నారని.. రెండేళ్ల క్రితం విజయమ్మ కారు ప్రమాదానికి గురైతే అందులో కుట్ర కోణం ఉందంటూ ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

అవును... రెండేళ్ల క్రితం విజయమ్మ కారు ప్రమదానికి గురైతే అందులో కుట్ర కోణం ఉందంటూ ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు లేవనెత్తారు.. చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర విమర్శలు చేశారు. ఇందులో భాగంగా... ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీకి లోకేష్ యజమానిగా మారారన్నట్లుగా వ్యాఖ్యానించారు.

ఇదే క్రమంలో... చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని.. మాటలు తప్ప, చేతలు శూన్యమని మండిపడిన కాకాణి... సగానికి సగం మందికి ఉచిత గ్యాస్ కట్ చేశారని ధ్వజమెత్తారు. ఇదే సమయంలో... చంద్రబాబు మోసపూరిత హామీలపై ఎమ్మెల్యేలే ఆగ్రహంగా ఉన్నారని.. సూపర్ సిక్స్ కాస్తా సూపర్ ఫ్లాప్ గా మారిందని.. లా అండ్ ఆర్డర్ లోనూ చంద్రబాబు ఫెయిల్ అయ్యారని అన్నారు.

ఇక వైఎస్ జగన్ కుటుంబంపై బురద చళ్లుతున్నారని.. వైఎస్ కుటుంబం గురించి నీచంగా ప్రచారం చేస్తున్నరని.. కోర్టులో ఉన్న కుటుంబ వ్యవహారాల గురించి కూడా రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని కాకాణి నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, హరికృష్ణ మరణాలు.. జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎంతో ఆరోగ్యంగా, బలంగా, క్రమశిక్షణగా ఉన్న ఎన్టీఆర్ ఎలా చనిపోయారో, ఎవరు చంపేశారో, ఎవరు వెన్నుపోటు పొడిచారో అందరికీ తెలుసని.. ఆయన చనిపోవడానికి చంద్రబాబు కారణం అనే విషయం సమాజం ఎప్పటికీ మరిచిపోదని కాకాణి చెప్పుకొచ్చారు! ఇక ఎన్నికల ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురవ్వడంలోనూ కుట్రకోణం ఉందని అనుకోవచ్చా అని ప్రశ్నించారు.

లోకేష్ కు భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ అడ్డు రాకూడదనే ఉద్దేశ్యంతో ఆ ప్రమాదం జరిగిందని భావించొచ్చా అని ప్రశ్నించారు. హరికృష్ణ భౌతికకాయం వద్ద చంద్రబాబు రాజకీయాలు మాట్లాడారని.. ఈ లెక్కన చూసుకుంటే హరికృష్ణ ప్రమాదంలో మరణించడంలోనూ కుట్రకోణం ఉందని అనుకోవచ్చా అని ప్రశ్నించారు.

ఇదే సమయంలో లోకేష్ కు అడ్డుగా వారసులు ఎవరూ ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే అని భావిస్తే.. జానకీ రామ్ మృతిలో కూడా కుట్ర కోణం ఉందని మేము భావించాలా అని ప్రశ్నించారు. తండ్రి మరణిస్తే తల కొరివి పెట్టడానికి మనసు రాని చంద్రబాబుకు కుటుంబాలు, విలువలు, బంధాల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి!

Tags:    

Similar News