కొత్త గవర్నర్లు... హరిబాబుకు ప్రమోషన్!

పలు కీలక రాష్ట్రాలలో గవర్నర్లను నియమించింది. ఈ నేపధ్యంలో విశాఖకు చెందిన కంభంపాటి హరిబాబుకు ప్రమోషన్ లభించింది.

Update: 2024-12-25 00:30 GMT

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొత్త గవర్నర్ల నియామకాన్ని చేపట్టింది. పలు కీలక రాష్ట్రాలలో గవర్నర్లను నియమించింది. ఈ నేపధ్యంలో విశాఖకు చెందిన కంభంపాటి హరిబాబుకు ప్రమోషన్ లభించింది

ఆయన మూడేళ్ళ క్రితం మిజోరాం గవర్నర్ గా నియమితులు అయ్యారు. ఇపుడు ఆయనకు ఒడిశా వంటి పెద్ద స్టేట్ కి గవర్నర్ గా నియమిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో హరిబాబుకు ప్రమోషన్ దక్కినట్లు అయింది.

బీజేపీలో ఆయన సుదీర్ఘ కాలం పనిచేశారు. అంతే కాదు ఎమ్మెల్యేగా విశాఖ ఎంపీగా విశేష సేవలు అందించారు. ఆయన చేసిన సేవలకు ఆయన అనుభవానికి గుర్తుగా మిజోరాం గవర్నర్ గా అవకాశాన్ని ఇచ్చారు. ఇపుడు ఆయనను ఒడిషాకు నియమించారు.

ఒడిషాలో ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అక్కడ గవర్నర్ గా హరిబాబుని పంపించడం ద్వారా మరింతగా రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలని భావిస్తున్నారని అంటున్నారు.

ఇక కొత్త గవర్నర్లను తీసుకుంటే కేరళ గవర్నర్ గా రాజేంద్ర ఆర్లేకర్, మిజోరాం గవర్నర్ గా విజయ్ కుమార్ సింగ్, బీహర్ గవర్నర్ గా అరిఫ్ అహ్మద్, మణిపూర్ గవర్నర్ గా కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా పనిచేసిన అజయ్ కుమార్ భల్లాను నియమించారు.

మణిపూర్ లో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని హోం శాఖలో సీనియర్ అయిన అజయ్ కుమార్ భల్లాకు అవకాశం ఇచ్చారని భావిస్తున్నారు. ఇక కొత్తగా ఆరు రాష్ట్రాలకు గవర్నల నియామకం చేపట్టినా కూడా అందులో తెలుగు రాష్ట్రాలలో టీడీపీ నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు.

టీడీపీకి చెందిన సీనియర్ నేతలు ఇద్దరిలో ఒకరికి గవర్నర్ పదవులు దక్కుతాయని ప్రచారం సాగింది. మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజులకు గవర్నర్లుగా నియమించే చాన్స్ ఉందని భావించారారు. అయితే వారికి ఈ విడతలో అయితే అవకాశం ఇవ్వలేదు. మరి వచ్చే సారి ఏమైనా అవకాశం ఉంటుందేమో చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News