అల్లు అర్జున్ మామ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా..?

మరోపక్క సామాన్యుడి నుంచి ప్రధాని వరకూ చట్టం ముందు అంతా సమానమే అంటూ అధికార పక్షం స్పందిస్తోంది.

Update: 2024-12-15 18:21 GMT

అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంతో సినిమా ఇండస్ట్రీలో జనాలు ఒక్కసారిగా షాక్ తిన్నారని చెబుతుండగా.. రాజకీయ రంగంలో మాత్రం విమర్శలు, ప్రతి విమర్శలు పీక్స్ కి చేరుకున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ పోలీసు చేసిన పనిపై ఓ వర్గం నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయని అంటున్నారు!

మరోపక్క సామాన్యుడి నుంచి ప్రధాని వరకూ చట్టం ముందు అంతా సమానమే అంటూ అధికార పక్షం స్పందిస్తోంది. తమ ప్రభుత్వం పొలిటికల్ స్టార్లు, సినిమా స్టార్లూ అనేది చూడదని.. తప్పు ఎవరు చేశారనేది మాత్రమే చూస్తాదంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సొంతమామకు సంబంధించి ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.

అవును... అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తెలంగాణలో అటు బీఆరెస్స్, ఇటు బీజేపీ నేతలు.. ఇటు ఏపీలో వైసీపీ నేతలూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరోపక్క అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తమ పార్టీ వ్యక్తే అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. జరిగిన పరిణామాల నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారని.. తప్పు లేకపోయినా అల్లు అర్జున్ ను దురుద్దేశంతోనే అరెస్ట్ చేశారని.. బెయిల్ వచ్చినా కావాలనే ఒక రాత్రి జైలులో ఉంచారంటూ వినిపిస్తున్న కామెంట్లను ఆయన సమర్ధిస్తున్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచన చేసినా అతిశయోక్తి లేదని కొదరంటుంటే.. ఇప్పటికే ఆ దిశగా ఆలోచన చేస్తున్నారంటూ మరికొంతమంది అంటున్నారని కథనాలొస్తున్నాయి. ఇదే సమయంలో... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. చంద్రశేఖర్ రెడ్డి తన పూర్వాశ్రమానికి వెళ్లే అవకాశం లేకపోలేదని కూడా చర్చ జరుగుతుందని తెలుస్తోంది.

కాగా... తొలుత బీఆరెస్స్ లోనే ఉన్న అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి ఆ పార్టీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చింది. అయితే.. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కూడా గులాబీ పార్టీలోనే కొనసాగారు. ఇక గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ టిక్కెట్ ఆశించారు.

కానీ... బీఆరెస్స్ నుంచి టిక్కెట్ దక్కలేదు. దీంతో.. పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ లో చేరారు. అయితే... ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టు, ఉద్దేశ్యపూర్వకంగా బెయిల్ వచ్చినా జైలులో ఒక రాత్రి ఉంచడం వంటి పరిణామాలతో ఆయన హర్ట్ అయ్యారని.. ఈ నేపథ్యంలోనే పార్టీ వీడే ఆలోచన చేస్తున్నారంటూ చర్చ మొదలైందని అంటున్నారు!

Tags:    

Similar News