పొలిటికల్ స్పీచ్ లు దంచేస్తోన్న టాప్ హీరోయిన్!
నా జన్మభూమి..నన్ను తిరిగి పిలిపించింది. ప్రజలు నాకు ఆ రుణం తీర్చుకునే అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది.
దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొన్న సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో కేటాయించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు ఈసీ రెడీ అవుతోంది. ఈసారి ఎన్నికల్లో సెలబ్రిటీలు కూడా బరిలోకి దిగుతు న్నారు. లోక్ సభ..శాసన సభ స్థానాలకు పోటీ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి. ఎంత మంది సెలబ్రిటీలు వచ్చినా? కంగన వేవ్ మాత్రం సంథింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతుంది.
ఇండస్ట్రీలో సత్తా చాటిన కంగన రాజకీయాల్లోనూ సత్తా చాటుతుందనే ధీమా వ్యక్తమవుతోంది. ఆమెలో తెగింపు..దైర్యం...సాహసం అనే అస్త్రాలతో రాజకీయాల్లో సునాయాసంగా రాణించగలదనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అవన్నీ చూసే బీజీపీ పార్టీ మండి నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీకి దించారు. తాను ఊహించినట్లుగానే అదిష్టానం మండి టికెట్ ఇచ్చి సత్తా చాటు కో అని వదిలారు. దీంతో కంగన పనిచేయాల్సిన సమయం వచ్చేసింది.
ఎన్నికల నేపథ్యంలో మండిలో ప్రచారం మొదలు పెట్టింది. పొలిటికల్ స్పీచ్ తో అక్కడి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అధికారంలోకి వస్తే ప్రజలకు పూర్తి సమయం కేటాయిస్తానంది. పార్లమెంట్ లో మండి ప్రజల గొంతునై ప్రశ్నిస్తానంది. పాఠశాలలు..ఆసుపత్రులు..రోడ్లు కోసం కృషి చేస్తానని.. ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడతానంది.స్వామి వివేకానందా...సద్గురు..మోదీ లాంటి వాళ్లు తనకు స్పూర్తి అని అంది.
నా జన్మభూమి..నన్ను తిరిగి పిలిపించింది. ప్రజలు నాకు ఆ రుణం తీర్చుకునే అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. దీంతో ఎన్నికలు పూర్తయ్యే వరకూ కంగన సినిమాల గురించి ఆలోచించే ప్రశక్తే లేదని తెలుస్తోంది.
రాజకీయాలంటే చాలా కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. బీజీపీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకి ఆ పార్టీ పై నిప్పులు చెరిగింది. ఆ తర్వాత అమ్మడు స్వరం మార్చి పార్టీ పై ప్రేమ పెంచుకుంది. మోదీ ఫాలోవర్ గా మారింది. దీంతో 2024 ఎన్నికలకు టికెట్ దక్కించుకుంది.