ఇద్దరు బిడ్డల తల్లి దేవతా సుందరిలా ఎలా?
తాను లావుగా ఉంటానని, తినడాన్ని ఆస్వాధిస్తానని తెలిపింది. తాను ఎప్పుడూ చిప్స్ ప్యాకెట్లు సుఖంగా తింటానని తెలిపింది.;

మొదటి కానుపు తర్వాత 45 కేజీల బరువు పెరిగిన బెబో కరీనా రెండో కానుపు తర్వాత 25 కేజీలు పెరిగిందట. ఆ రెండు సందర్భాలలో తిరిగి తన పాత రూపాన్ని తెచ్చేందుకు చాలా శ్రమించింది. జిమ్, యోగా సెషన్స్, మెడిటేషన్ తో అనుకున్నది సాధించుకుంది. అయితే బొద్దుగా ఉండే తన సహజతత్వం గురించి కూడా బెబో మాట్లాడింది. తాను లావుగా ఉంటానని, తినడాన్ని ఆస్వాధిస్తానని తెలిపింది. తాను ఎప్పుడూ చిప్స్ ప్యాకెట్లు సుఖంగా తింటానని తెలిపింది. నాకు నేనే ఫేవరెట్ అని జబ్ వియ్ మెట్ లో డైలాగ్ లా తనను తాను ఎప్పుడు ప్రశంసించుకుంటూనే ఉంటుంది.

పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బెబో తన తిండి, ఇతర హ్యాబిట్స్ గురించి మాట్లాడింది. జెహ్ పుట్టాక 45 కేజీలు పెరిగాను.. అదనపు బరువు తగ్గేందుకు చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నానని కరీనా తెలిపింది. మనకు మనం నమ్మాలి. మనల్ని మనం పొగడాలి. మన విధానాలను మనం సమర్థించుకోవాలని కూడా కరీనా చెప్పింది. అయితే కరీనా తన అత్యంత నమ్మకంగా ఉన్న క్లయింట్లలో ఒకరని ఆహార నిపుణురాలు రుజుత తెలిపారు. బెబో తనను తాను నిజంగా ప్రశంసించుకుంటుంది. నేను ఎంత బాగున్నానో మీకు చెప్పలేను.. నేను కర్రలా కనిపిస్తున్నాను అని బెబో చెబుతుంది. నేను దీనిని చాలా ఇష్టపడతాను! అని తెలిపింది.
సన్నగా కనిపించడానికి నేను ఎప్పుడూ ఆకలితో అలమటించలేదని కూడా కరీనా అంది. నేను ఆ సమయంలో చాలా సుఖంగా ఉన్నాను. నా టీనేజ్ లో కూడా ఎల్లప్పుడూ చిప్స్ ప్యాకెట్ తినడానికి నిజంగా ఆసక్తిగా ఉన్నాను.. అని తెలిపింది బెబో. కరీనా తన రెండవ బిడ్డ జహంగీర్ అలీ ఖాన్‌కు జన్మనిచ్చిన సమయం గురించి మాట్లాడింది. ``జెహ్ పుట్టిన తర్వాత ఓ మై గాడ్! నేను తిరిగి వెళ్లి జిమ్ లో చాలా శ్రమించాలి అనుకున్నాను.. 25 కేజీలు అదనపు బరువు పెరిగాను..`` అని వెల్లడించింది. 2024లో కరీనా కపూర్ ఖాన్ క్రూ, సింఘం ఎగైన్ చిత్రాలలో కనిపించింది. తదుపరి సినిమా గురించి ఇంకా వివరాలు వెల్లడించాల్సి ఉంది.