"ఆమెకు నా చావు కావాలి"... భర్త సూసైడ్ నోట్ కలకలం!
అవును.. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ సమయంలో... తన భార్య చిత్రహింసలకు గురిచేస్తుందని ఆరోపిస్తు ఆత్మహత్య లేఖ రాశాడు.
భార్య వేధింపులు తాళలేక, భార్య తరుపు కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక సూసైడ్ నోట్స్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇటీవల బెంగళూరులో వెలుగుచూసి తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... భార్య తన చావు కోరుతుందంటూ ఓ వ్యక్తి సూసైడ్ లేటర్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది.
అవును.. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ సమయంలో... తన భార్య చిత్రహింసలకు గురిచేస్తుందని ఆరోపిస్తు ఆత్మహత్య లేఖ రాశాడు. ఈ సందర్భంగా తండ్రిని జాగ్రత్తగా చూసుకోమని తన అన్నకు చెప్పాడు. ఈ విషయం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దామ్..!
పీటర్ గొల్లపల్లి అనే వ్యక్తికి ఫిబే అనే మహిళతో రెండేళ్ల క్రితం వివాహం అయ్యిందట. ఈ క్రమంలో వారి దాంపత్యంలో మనస్పర్థలు రావడంతో... మూడు నెలలుగా వీరిద్దరూ విడిపోయి ఉంటున్నారు.. విడాకుల వ్యవహరం ఇంకా కోర్టులోనే ఉంది. ఈ సమయంలో.. అటువైపు నుంచి చిత్రహింసలు ఎక్కువయ్యాయని అంటున్నారు.
మరోపక్క ఈ విడాకుల కేసులో తన భార్య సోదరుడు రూ.20 లక్షలు డిమాండ్ చేశాడని అంటున్నారు. దీంతో... తీవ్ర ఒత్తిడికి గురయ్యాడట పీటర్ గొల్లపల్లి. ఇటు ఆర్థిక ఇబ్బందులు, అటు మానసిక ఇబ్బందులు, మరోపక్క లక్షల రూపాయల డిమాండ్, కోర్టు కేసుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని ఫిక్సయిపోయి సూసైడ్ లెటర్ రాసినట్లు తెలుస్తోంది.
ఈ లేఖలో... తన తండ్రిని ప్రస్థావిస్తూ... "నాన్న.. నన్ను క్షమించండి.. నా భార్య పింకీ నన్ను చంపుతోంది.. ఆమె నా చావును కోరుకుంటోంది.. నా భార్య చిత్రహింసల కారణంగా నేను చనిపోతున్నాను" అని రాశాడు! అదే లేఖలో... "అన్నా.. దయచేసి తల్లితండ్రులను జాగ్రత్తగా చూసుకోండి" తన సోదరుడిని ప్రస్థావించారు!
ఈ విషయాలపై స్పందించిన పీటర్ సోదరుడూ జోయల్ గొల్లపల్లి... ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు చర్చి నుంచి తిరిగి వచ్చి చూసే సరికి ఇంట్లో అతని మృతదేహం ఉందని.. అతని డెత్ నోట్ లో పింకీ అనే అతని భార్య ఫీబే తనను చనిపోవాలని కోరుకుంటుందని చెప్పాడని తెలిపారు. దీంతో.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
దీంతో... ఘటనా స్థలానికి చేరుకున్న హబ్బళ్లీలోని అశోక్ నగర్ పోలీసులు బీ.ఎన్.ఎస్. సెక్షన్ 108 కింద పీటర్ భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని అంటున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది!