మియా ఖలీఫా కోసం పూజలు... తాత వీడియో వైరల్!
ఇందులో భాగంగా... మాజీ అడల్ట్ ఫిల్మ్ స్టార్ మియా ఖలీఫా ఫోటో పెట్టి కర్వా చౌత్ పూజ చేశాడు.
భారతదేశంలో వివాహిత మహిళలకు ముఖ్యమైన పండుగల్లో ఒకటి కర్వా చౌత్. ఈ పండుగను ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, జమ్మూ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మొదలైన రష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. ఇక ఏపీలో దీన్ని అట్లతద్దె గా జరుపుకుంటారు. వారి వారి భర్తల దీర్ఘకాలం ఆరోగకరమైన జీవితం కోసం భార్యలు ఉపవాసం చేస్తుంటారు.
ఇలా మహిళలు ఎంతో సాంప్రదాయ బద్ధంగా జరుపుకునే ఈ కర్వా చౌత్ ను ఓ వృద్ధుడు కూడా జరుపుకున్నారు. ఇదే వెరైటీ అంటే.. అంతకు మించిన వెరైటీని చూపించాడు. ఇందులో భాగంగా... మాజీ అడల్ట్ ఫిల్మ్ స్టార్ మియా ఖలీఫా ఫోటో పెట్టి కర్వా చౌత్ పూజ చేశాడు. దీనికి సంబందించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
అవును... భారత్ లో వివాహిత మహిళలు తమ తమ భర్తలు దీర్ఘకాల ఆరోగకరమైన జీవితాల కోసం ఉపవాసం చేస్తూ చేసే ప్రత్యేక పండుగైన కర్వా చౌత్ ను ఓ వృద్ధుడు అడల్ట్ ఫిల్మ్ స్టార్ కోసం చేశాడు. ఇందులో భాగంగా... జల్లెడలో దీపం పెట్టి, అందులో నుంచి గోడపై ఉన్న మియా ఖలీఫా పోస్టర్ ను చూశాడు.
ఈ వీడియోను ఓ యూజర్ ఎక్స్ లో షేర్ చేయగా.. ఇప్పుడు ఇది వైరల్ గా మారుతోంది. ఇలా సాంప్రదాయ థాలీ, చనీతో పూజలో నిమగ్నమైనట్లు కనిపించిన వృద్ధుడు.. గొడకు అతికించి ఉన్న మియా ఖలీఫా ఫోటోని చూస్తూ, ఆమె ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లతో హల్ చల్ చేస్తున్నారు.
అయితే... ఈ వీడియోని కొంతమంది ఫన్నీగా చూడగా.. మరికొంతమంది మాత్రం ఫైర్ అవుతున్నారు. వ్యూస్ కోసం కర్వా చౌత్ వేడుకను వాడుకొవడం బాధాకరమని, ఇలాంటి పనులు కరెక్ట్ కాదని చురకలు అంటిస్తున్నరు. మరికొంతమంది... "హే భగవాన్" అని కామెంట్ చేస్తున్నారు.