కామారెడ్డి ఎమ్మెల్యేకి పెద్ద చిక్కొచ్చి పడిందే !

శాసనసభ లోపల ఒకరిని ఒకరు తిట్టుకంటున్నారని, శాసనసభ బయట వారే చెట్టాపట్టాల్ వేసుకుని తిరుతున్నారని కాటేపల్లి విమర్శించారు.

Update: 2024-07-25 23:30 GMT

‘‘నేను అనవసరంగా గెలిచి శాసనసభకు వచ్చాను అని బాధగా అనిపిస్తుంది. గతంలో శాసనసభ ముందు నుండి వెళ్లేటప్పుడు ఎప్పుడు శాసనసభలో అడుగు పెడతానా అనుకునేవాడిని. ప్రజలకు ఎమ్మెల్యేలు మంచి చేస్తారని భావించేవాడిని. కానీ ఇక్కడ శాసనసభ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తే బాధగా ఉంది’’ అని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

శాసనసభ లోపల ఒకరిని ఒకరు తిట్టుకంటున్నారని, శాసనసభ బయట వారే చెట్టాపట్టాల్ వేసుకుని తిరుతున్నారని కాటేపల్లి విమర్శించారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన నాకు సభలో ఎలా వ్యవహరించాలో తెలుసని, సభలో ఇద్దరు నాయకులు మాట్లాడితే 60 మంది వారికి భజన చేస్తున్నారని, జీతాలు తీసుకుంటున్న వారు కూడా సభకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు సభలో ప్రజల గురించి మాట్లాడే నాయకులే లేరని, ప్రజా సమస్యల గురించి వారు పట్టించుకోవడం లేదని కాటేపల్లి అన్నారు. కామారెడ్డి శాసనసభ స్థానం నుండి బీజేపీ తరపున పోటీ చేసిన కాటేపల్లి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద 6741 మెజారిటీతో గెలిచాడు. ఇక్కడ పోటీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 54916 ఓట్లు వచ్చాయి. ఇద్దరు సీఎంల మీద గెలిచిన కాటేపల్లికి సభలో సమావేశాల మీద అంత బాధ ఎందుకు కలిగిందో మరి.

Tags:    

Similar News