మరో వివాదంలో కౌశిక్ రెడ్డి.. అధికారులు ఏం చేయబోతున్నారు..?

ఇంకా వీఐపీలు అయితే.. సామాన్య భక్తులకు ఎంతగానో ఆదర్శంగా నిలవాలి.

Update: 2024-10-21 05:50 GMT

ఏపీకి తిరుమలలాగే.. తెలంగాణకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం అలా. ఇటీవల సినీనటుడు సుమన్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఎవరైనా.. ఎంతటి పెద్దవారైనా ఆలయానికి వచ్చామంటే.. భక్తిశ్రద్ధలతో భగవంతుడిని దర్శనం చేసుకొని వెళ్తాం. ఇంకా వీఐపీలు అయితే.. సామాన్య భక్తులకు ఎంతగానో ఆదర్శంగా నిలవాలి. కానీ.. కొంత మంది నేతలే క్రమశిక్షణ తప్పుతూ ఎక్స్‌ట్రాలు చేస్తుండగా.. సామాన్య భక్తులే ఆలయ నిబంధనలు పాటిస్తూ వస్తున్నారు.


బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఆలయ పవిత్రతను కాపాడాల్సిన ఆయన.. నిబంధనలను విస్మరించారు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచే కౌశిక్ రెడ్డి.. ఈసారి యాదాద్రి నర్సన్న ఆలయంలో చేసిన పనితో మరోసారి అభాసుపాలయ్యాడు. ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ నుంచి ఆయన ఎన్నో కాంట్రవర్సీలను మూగట్టుకున్నారు. తాజాగా.. మరో వివాదం ఆయనను మరింత అగాధంలోకి నెట్టింది.

పాడి కౌశిక్ రెడ్డి తన భార్య, కూతురితో కలిసి ఇటీవల యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణం, పరిసరాల్లో రీల్స్ చేసినట్లుగా వెల్లడైంది. ఆయన చేసిన వీడియోలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దాంతో ఇప్పుడు భక్తులంతా ఆయనపై ఫైర్ అవుతున్నారు. ఆలయాలకు వెళ్లినప్పుడు సెల్ఫీలు తీసుకోవడం కామన్. కానీ.. రీల్స్ చేయడం కరెక్టు కాదనేది ఓ ప్రజాప్రతినిధిగా అతనికి తెలియకపోవడం శోచనీయమని అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు నీతులు బోధించే మీరే.. నిబంధనలు పాటించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఓ ఎమ్మెల్యే అయి ఉండి.. ఆలయంలో ఈ చెత్త రీల్స్ చేయడం ఏంటని ఘాటుగానే స్పందిస్తున్నారు. ఆలయంలో సెల్‌ఫోన్లు, కెమెరాలు నిషేధం అని ఉన్నప్పటికీ రీల్స్ చేయడం ఏంటా అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. కానీ.. ఆలయ మాడవీధుల్లో వీడియోలు చేయడం వివాదాస్పదమైంది. అయితే.. కౌశిక్ రెడ్డి రీల్స్ కోసమే ఆలయానికి వచ్చినట్లుగా ఆ వీడియోలను చూస్తే అర్థమవుతోంది. అయితే.. తిరుమల శ్రీవారి ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి రీల్స్ చేయగా వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే.. కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడంపై ఆలయ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News