కవిత...రేవంత్ రెడ్డిని ఎంత పెద్ద మాట అన్నది

ఈ నేపధ్యంలో లేటెస్ట్ గా కవిత తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మీద హాట్ కామెంట్స్ చేశారు.

Update: 2024-12-11 03:34 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముద్దుల కూతురు కవిత. కేటీయార్ ముద్దుల చెల్లెలు. తెలంగాణా మాజీ ఎంపీ అయిన కవిత గులాబీ పార్టీ అధికారంలో ఉన్నపుడు తనదైన శైలిలో దూకుడుగా రాజకీయాలు చేసిన వారే. ఆమె కూడా తండ్రి కేసీఅర్ మాదిరిగానే రాణించాలని ఉబలాటపడిన వారే.

అయితే అధికారం పోయిన తరువాత కాలం కలసి రాక ఆమె అరెస్ట్ అయి చాలా నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఇటీవల బెయిల్ మీద వచ్చిన కవిత కొన్నాళ్ళు మౌనం పాటించారు. మళ్లీ ఇపుడు సౌండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో లేటెస్ట్ గా కవిత తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మీద హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణా తల్లి విగ్రహం డిజైన్ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాని విమర్శిస్తున్న సంగతి విధితమే. ఆ విగ్రహం డిజైన్ బాగులేదని బీఆర్ ఎస్ నేతలు అంతా విమర్శలు చేస్తూ వస్తున్నారు.

కవిత కూడా తెలంగాణా భవన్ లో ఇదే విషయం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గట్టిగా విమర్శించారు. తెలంగాణా తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి మరీ కేడర్ ని ఉద్దేశించి స్పీచ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని ఆనేక విమర్శలు ఎక్కుపెట్టారు.

ఇదే వరసలో ఇదే స్పీడ్ లో ఆమె రేవంత్ రెడ్డి మీద ఒక పెద్ద మాటే అనేశారు. రేవంత్ రెడ్డి బాస్ చంద్రబాబు అని ఆమె తీవ్రమైన కామెంట్స్ చేశారు. అందుకే రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారు అని బాబుకు రేవంత్ రెడ్డికి ముడిపెట్టి సెటైర్లు వేశారు.

ఇక గత ఏడాది ఎన్నికలకు ముందు కేటీఅర్ కూడా చంద్రబాబు అరెస్ట్ మీద హైదరాబాద్ లో టీడీపీ అభిమానులు నిరసనలు ఆందోళనలు చేస్తే వారి మీద నోరు పారేసుకున్నారు అని గుర్తు చేస్తున్నారు. అది కాస్తా పెద్ద దుమారంగా మారి చివరికి బీఆర్ ఎస్ ఏకంగా అధికారాన్ని పోగొట్టుకున్న దాకా వెళ్ళిందని గుర్తు చేస్తున్నారు.

అయితే రేవంత్ రెడ్డికి చంద్రబాబు బాస్ అని కవిత్ అన్న మాటలను ఆమెకే నెటిజన్లు తిప్పికొడుతున్నారు. ఒకనాడు కేసీఅర్ కి కూడా చంద్రబాబు బాస్ కదా అని అంటున్నారు. ఆ విషయం కల్వకుంట్ల కవిత మరచిపోతే ఎట్లా అని సెటైర్లు వేస్తున్నారు.

మొత్తానికి చూస్తే కవిత విమర్శలు అన్నీ ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డికి చంద్రబాబు బాస్ అని అనడం మరో ఎత్తుగా ఉంది. దీని మీదనే ఇపుడు అంతటా చర్చ సాగుతోంది. ఇంత పెద్ద మాట కవిత ఎలా అనేసింది అని అంతా ఆలోచిస్తున్నారు. చూడాలి మరి దీనికి కాంగ్రెస్ నుంచి కౌంటర్ ఏమి వస్తుందో. ఏది ఏమైనా కవిత మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోని వచ్చారు. వస్తూనే రేవంత్ రెడ్డి మీద విమర్శల బాణాలు వేస్తున్నారు.

Tags:    

Similar News