తీహార్ జైల్లో కవితకు అదిరిపోయే ఏర్పాట్లు: కోర్టు అనుమతి
అయితే.. ఆమె అభ్యర్థన మేరకు ఆ జైల్లో అదిరిపోయే సౌకర్యాలు కల్పించారు. దీనికి కోర్టు కూడా అంగీకారం తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తొలుత సాక్షిగా.. తర్వాత ప్రధాన నిందితురాలిగా ఈడీ పేర్కొన్న బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. అయితే.. ఆమె అభ్యర్థన మేరకు ఆ జైల్లో అదిరిపోయే సౌకర్యాలు కల్పించారు. దీనికి కోర్టు కూడా అంగీకారం తెలిపింది.
ఇవీ.. సౌకర్యాలు..
+ తిహార్ జైల్లో కవిత ఉన్నన్ని రోజులు ఇంటి నుంచి తెప్పించుకున్న భోజనం అనుమతిస్తారు.
+ జైల్లో ఉన్నప్పటికీ ఆభరణాలు ధరించేందుకు వీలు కల్పించారు.
+ మంచం, పరుపు, చెప్పులు, దుస్తులు, బెడ్ షీట్, దుప్పటి, పుస్తకాలు, పెన్నులు, రాసుకోవటానికి కాగితాలు, ఆభరణాలు, మందులు తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.
+ కస్టడీలో ఉన్న సమయంలో కవితకు చేసిన అన్ని వైద్య సంబంధిత రికార్డుల్ని ఆమె తరఫు న్యాయవాదులకు అందజేయాలి.
+ సహజంగా జైల్లో ఉంటే మహిళలు ఆత్మహత్య చేసుకునేందుకు అవకాశం ఉంటుందనే కారణంగా ఆభరణాలను అనుమతించరు. అయితే.. హై ప్రొఫైల్ నేరస్తురాలిగా కవితను ఈడీ ప్రొజెక్టు చేయడంతో ఆమెకు కొన్ని సౌకర్యాలు కల్పించారు. దీనిలో భాగంగానే తాళిబొట్టు.. నల్లపూసలు.. గాజులు లాంటి ఆభరణాల్ని ధరించేందుకు అనుమతి ఇచ్చారు.