భర్త, కొడుకును హత్తుకొని.. కవిత ఏమోషనల్.. వైరల్

కవితను అరెస్ట్ చేసే సందర్భంలో ఆమె తన కొడుకును హత్తుకుని వీడ్కోలు పలికింది.

Update: 2024-03-16 04:00 GMT

ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లారు. ఈ రోజు కోర్టు ఎదుట ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. శని, ఆదివారాలు సెలవులు ఉంటే సోమవారం కవితను కోర్టులో ప్రవేశపెడతారని అంటున్నారు. దీంతో ఈ కేసులో ఏం జరగబోతోందనే వాదనలు వస్తున్నాయి. కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే.

కవితను అరెస్ట్ చేసే సందర్భంలో ఆమె తన కొడుకును హత్తుకుని వీడ్కోలు పలికింది. ధైర్యంగా ఉండాలని సూచించింది. తనకు ఏం కాదని న్యాయపోరాటంలో తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేసినా తనకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కవిత అరెస్ట్ రాష్ట్రంలో సంచలనంగా మారింది.

తనను అరెస్ట్ చేస్తున్నారనే బాధ ఏ కోశాన కూడా కనిపించలేదు. నవ్వుతూనే అందరిని పలకరించింది. మద్యం కేసులో తనకు ఎలాంటి ముప్పు ఉండదనే కోణంలో ఆమె హుషారుగానే కలియ తిరిగింది. కార్యకర్తలు, నేతలకు అభివాదాలు చేసింది. మళ్లీ తిరిగి వస్తానని అందరికి చెప్పింది. ఎవరు ఆందోళన పడాల్సిన పనిలేదని వెల్లడించింది.

రాజకీయ కుట్రలో భాగంగానే తన అరెస్ట్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ పన్నిన కుట్రగా అభివర్ణించింది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగానే అరెస్ట్ నాటకం కేంద్రమే ఆడిస్తోందన్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. ఈడీ తనను అరెస్ట్ చేసినా తనకు ఎలాంటి బాధ లేదని చెప్పారు. రాజకీయ కక్షలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ అనుకుంటోందని ఆరోపించారు.

ఉద్వేగంతో భర్తను కూడా హత్తుకుంది. భర్త అనిల్ కూడా కవితను ఓదార్చారు. ఈ కేసులో ఎలాంటి మకిలీ అంటకుండా తిరిగి వస్తావని ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. ఈడీ అరెస్ట్ విషయం ముందు అనిల్ కే సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. మొత్తానికి కవిత వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. కవిత ఈ కేసులో ఎలా బయటపడుతుందనే కోణంలో పలువురు చర్చించుకోవడం గమనార్హం.




Tags:    

Similar News