కేసీఆర్ జీవితంలో మరో మర్చిపోలేని రోజు!
తాను ముఖ్యమంత్రిగా ఉన్న వేళలోనే.. తానెంతో అల్లారుముద్దుగా చూసుకునే కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయి.. ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లాల్సి రావటం.. అక్కడే ఉండాల్సిన దుస్థితిని ఆయన ఎప్పటికి మర్చిపోలేరు.
తిరుగులేని అధికారాన్ని చేతిలో ఉంచుకొని ఏళ్లకు ఏళ్లు దాన్ని ఎంజాయ్ చేసిన పెద్ద మనిషికి.. ఇంతకుమించిన దారుణమైన రోజు ఏముంటుంది? తనకెంతో ఇష్టమైన కుమార్తె జైల్లో ఉండాల్సి రావటం.. అది కూడా నెలల తరబడి తీహార్ జైల్లో.. ఈ రోజున (సోమవారం) తీవ్రమైన అవినీతి ఆరోపణల నేపథ్యంలో తన రాజకీయ వారసుడైన కొడుకు ఏసీబీ ముందుకు వెళ్లాల్సి రావటానికి మించిన చెత్త రోజు గులాబీ బాస్ కేసీఆర్ కు ఇంకేం ఉంటుంది. వ్యక్తిగా మొదలై తానే వ్యవస్థగా మారి.. తన మాటే వేదంలా నడిచిన స్థాయి నుంచి.. తనకు తాను మాత్రమే అన్నట్లుగా మారుమూలన ఉన్న ఫాంహౌస్ కు పరిమితం కావటం కేసీఆర్ కు మాత్రమే చెల్లిందని చెప్పాలి.
తాను ముఖ్యమంత్రిగా ఉన్న వేళలోనే.. తానెంతో అల్లారుముద్దుగా చూసుకునే కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయి.. ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లాల్సి రావటం.. అక్కడే ఉండాల్సిన దుస్థితిని ఆయన ఎప్పటికి మర్చిపోలేరు. విపక్షంలో ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వెన్నులో చలి పుట్టించి.. ఆయన కోపం వస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందన్న భయంతో.. ఆయనతో వీలైనంత సామరస్యంగా వ్యవహరించిన స్థాయి నుంచి.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. తన కుమార్తెను అరెస్టు నుంచి కాపాడుకోలేకపోవటానికి మించిన విషాదం కేసీఆర్ లాంటి వ్యక్తికి ఇంకేం ఉంటుంది.
ఇప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కొడుకు కేటీఆర్ విచారణకు హాజరయ్యేందుకు ఏసీబీ ఎదుట హాజరు కావాల్సి రావటాన్ని కేసీఆర్ జీర్ణించుకోవటం కష్టమే. ఆయన గురించి.. ఆయన మైండ్ సెట్ గురించి తెలిసిన వారంతా కేటీఆర్ ఏసీబీ ఎదుట హాజరయ్యే సందర్భంలో గులాబీ బాస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. విచారణకు కేటీఆర్ వెళ్లే వేళలో కేసీఆర్ ను కదిలించే సాహసం ఎవరూ చేయలేరంటున్నారు. ఓటమి తర్వాత నుంచి గంభీరంగా మారిపోయి.. పరిమిత వ్యక్తుల్ని మాత్రమే కలుస్తున్న పరిస్థితి. అలాంటి కేసీఆర్ ను.. కేటీఆర్ ఏసీబీ ఎదుట హాజరయ్యే సమయంలో ఆయన మైండ్ సెట్ రగిలిపోతున్న అగ్నిపర్వతంలా ఉంటారని.. ఆ టైంలో ఆయనతో మాట కదపటం పెద్ద సాహసంగా చెబుతున్నారు. కేసీఆర్ జీవితంలో మర్చిపోలేని వేదనాభరితమైన రోజులు ఏమైనా ఉన్నాయంటే.. కవిత అరెస్టు అయిన రోజు మొదటిది అయితే.. రెండోది మాత్రం కేటీఆర్ ఏసీబీ ఎదుట హాజరు కావటమేనని చెబుతున్నారు.