కేసీఆర్ వార్నింగ్ ఆ ఎమ్మెల్యేకి ?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేకు సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది.

Update: 2024-09-13 04:18 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేకు సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. తెలంగాణలో సాగుతున్న రాజకీయ లొల్లికి కారణం అయిన ఆ ఎమ్మెల్యే మీద ఆయన సీరియస్ అయ్యారని అంటున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు కౌశిక్ రెడ్డి. ఆయన అరికపూడి గాంధీ మీద విమర్శలు చేస్తూ గత కొద్ది రోజులుగా చెడుగుడు ఆడుతున్నారు.

ఈ మొత్తం వివాదం కాస్తా అనేక మలుపులు తిరిగింది. అయితే ఇందులో ప్రజా ప్రయోజనం అన్నది పెద్దగా లేకపోగా లేని పోని కొత్త వివాదాలు కూడా ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా అరికపూడి గాంధీని ఉద్దేశించి నాన్ లోకల్ తాను పక్కా తెలంగాణా అని కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ కి డ్యామేజ్ గా మారుతున్నాయని అంటున్నారు.

బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనలో ఎక్కడా ఇలాంటి పదాలు వాడకుండా జాగ్రత్త పడింది. హైదరాబాద్ లో సెటిలర్ల మద్దతుని అందుకుంది. అందుకే వరసబెట్టి రెండు సార్లు హైదరాబాద్ కార్పొరేషన్ మీద గులాబీ పార్టీ జెండా ఎగరేయగలిగింది.

అంతే కాదు, గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు కాపాడింది కూడా గ్రేటర్ హైదరాబాద్. ఆ విధంగా సెటిలర్లు అంతా గులాబీ పార్టీని ఆదరించకపోతే దారుణమైన ఓటమి జరిగి ఉండేది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి గాంధీ మధ్య వివాదంలో ఆంధ్రులు అంటూ ప్రాంతీయ వాదాన్ని తేవడం పట్ల రచ్చ సాగుతోంది.

దీంతో పాడి కౌశిక్ రెడ్డికి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినట్లుగా వార్త అయితే ప్రచారంలో ఉంది. కాంగ్రెస్ గత ఎన్నికల వేళ ఇచ్చిన హామీల మీద వాటి అమలు మీద పోరాటం చేయకుండా ఎమ్మెల్యేల జంపింగుల మీద పోరాటం ఏంటి అని కేసీఆర్ గుస్సా అయినట్లుగా చెబుతున్నారు.

ఈ జంపింగుల మీద ఇష్యూ రైజ్ చేస్తే అది చివరికి మనకే తగులుకుంటుంది అని కేసీఆర్ అన్నట్లుగా చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ చేయని పనుల మీద పోరాటాలు చేస్తే రాజకీయంగా బీఆర్ఎస్ కి మైలేజ్ వస్తుందని కేసీఆర్ సూచించారు అని అంటున్నారు.

అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గాడి తప్పి జంపింగులు ఫిరాయింపుల కంపు మీద చేస్తున్న పోరాటం కాస్తా చివరికి బూమరాంగ్ అయ్యేలా ఉందని కేసీఆర్ గుర్రు మీద ఉన్నారని టాక్ నడుస్తోంది. తెలంగాణాలో కాంగ్రెస్ పాలన మీద వారి విధానాల మీద పోరాటం చేయకుండా ఏంది ఈ లొల్లి అని కూడా కేసీఅర్ సీరియస్ అయ్యారని అంటున్నారు.

తెలంగాణా వర్సెస్ ఆంధ్రా సెటిలర్స్ అంటూ ఏంది ఈ కొత్త పంచాయతీ అని కూడా సదరు ఎమ్మెల్యే మీద ఫైర్ అయినట్లుగా త్లుస్తోంది. సెటిలర్లు అనుకూలంగా ఉన్నారు కాబట్టే హైదరాబాద్ గడ్డ మీద జీహెచ్ ఎం సీలో గులాబీ పార్టీ చల్లగా ఉందని కూడా కేసీఅర్ హితబోధ చేసినట్లుగా తెలుస్తోంది.

ఏది ఏమైనా బీఆర్ఎస్ కి అనుకున్నది ఒకటి అయితే జరుగుతున్నది మరోటి అన్నట్లుగా ఉంది. ఆ పార్టీలో సైలెంట్ స్పెక్టేటర్లుగా చాలా మంది ఉన్నారు. ఎవరి బిజినెస్ లో బిజీలో వారు ఉన్నారు. ఎంతసేపూ కేటీఆర్ తప్పితే హరీష్ రావు మాత్రమే కాంగ్రెస్ మీద పోరాటానికి ముందుకు వస్తున్నారు.

యువ నాయకుడు కదా అని కౌశిక్ రెడ్డిని ముందుకు తెస్తే ఆయన వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు దాంతో మరింత బదనాం అవుతున్నామన్న ఆందోళన అయితే బీఆర్ఎస్ అధినాయకత్వంలో ఉందని అంటున్నారు. దీంతోనే మౌన మునిగా ఇన్నాళ్ళూ ఉన్న కేసీఆర్ ఇపుడు తన సొంత పార్టీ ఎమ్మెల్యే మీదనే గట్టిగా నోరు చేసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. ఏది ఏమైనా తొందరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి.

ఇపుడు సెటిలర్ల పేరిట అగ్గి రాజేస్తే మాత్రం కాంగ్రెస్ కి బ్రహ్మాండమైన అస్త్రంగా మారుతుంది. దాంతో గులాబీ పార్టీకి కొత్త చిక్కులు మొదలవుతాయని అంటున్నారు. అందుకే కేసీఆర్ తనదైన క్లాస్ తీసుకున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News