కేసీఅర్ జగన్ ల మీద ఎందుకు సానుభూతి లేదు ?

ఇది చాలా చిన్న ప్రశ్నగా అనిపించే పెద్ద ప్రశ్న. జవాబు చెప్పడం చాలా కష్టం.

Update: 2024-07-02 10:30 GMT

ఇది చాలా చిన్న ప్రశ్నగా అనిపించే పెద్ద ప్రశ్న. జవాబు చెప్పడం చాలా కష్టం. కానీ అదే సమయంలో సులువు. ఇది ఆయా పార్టీలను అభిమానించే వారికి తెలుసు. అలాగే ఆయా పార్టీల తీరు తెన్నులను అధినేతల పోకడలను చూస్తున్న వారికి కూడా తెలుసు. కానీ జవాబు తెలిసినా అధినేతలకు చెప్పే వారు లేరా లేరా వారికి కూడా తెలుసు అని మౌనం వహిస్తున్నారా అన్నదే అసలు చర్చ.

ఇదిలా ఉంటే ఏపీలో జగన్ దారుణంగా ఓటమి పాలు అయ్యారు. తెలంగాణలో కేసీఅర్ ఆరు నెలల క్రితం అసెంబ్లీలో ఓటమి ఎదుర్కొన్నారు. తాజాగా ఎంపీ ఎన్నికల్లో జీరో నంబర్ కి పడిపోయారు. మరి ఈ ఇద్దరు నేతలూ సామాన్యులు కాదు. ఒకనాడు కాలానికి ఎదురొడ్డి నిలిచిన నేతలు. ఇపుడు పరాజితులు.

ముందుగా కేసీఆర్ గురించి తీసుకుంటే తెలంగాణా రాష్ట్రం అన్న కలను నెరవేర్చారు. అది రాదు అనుకున్న వేళ దాన్ని తెచ్చి తానేంటో చూపించారు. సకల జనుల సమ్మెని చేయించి అందరినీ తన వైపునకు తిప్పుకుని తెలంగాణ అంటే కేసీఅర్ అన్నట్లుగా మారారు. దాంతో తప్పనిసరి పరిస్థితులలో సోనియాగాంధీ తెలంగాణాను రాష్ట్రంగా ప్రకటించాల్సి వచ్చింది. అలా జాతీయ స్థాయిలో కేంద్రాన్ని కదలించి మరీ తెలంగాణాను కేసీఆర్ తీసుకుని వచ్చారు. తెలంగాణా ఉద్యమంలో అన్ని సంఘాల మద్దతు కేసీఆర్ కి లభించింది. అలా అందరి వాడుగా ఆయన ముందు వరసలో ఉన్నారు. కీర్తించబడ్డారు.

Read more!

అదే ఊపులో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బొటా బొటీ మెజారిటీతో గెలిచి తెలంగాణాకు మొదటి సీఎం గా కేసీఆర్ రికార్డు సృష్టించారు. ఆనాడు అర్బన్ లో గెలవకున్నా రూరల్ సెక్టార్ లో గెలిచి కేసీఆర్ అధికారాన్ని సొంతం చేసుకున్నారు. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత తనదైన ముద్రతో పాలన చేశారు కేసీఅర్. అసలు తెలంగాణాలో ప్రతిపక్షాలు అన్నవి లేకుండా చేశారు. తనకు తిరుగులేనట్లుగా సీఎం పదవిని కేసీఆర్ అనుభవించారు.

ఇక 2018లో జరిగిన తెలంగాణా ఎన్నికల్లో కేసీఅర్ కు చంద్రబాబు పోటీ చేయడం బాగా కలసివచ్చింది అని చెప్పాలి. అంతే కాదు కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకున్న తరువాత కేసీఆర్ కి సరైన ఆయుధం దొరికింది. దాంతో మళ్లీ తెలంగాణాను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో కలుపుతోందని కేసీఆర్ ఆనాడు ఎన్నికల స్లోగన్ అందుకున్నారు. అది భావోద్వేగాలను తెలంగాణాలో రేపింది.

దాంతో కేసీఆర్ ఆ ఎన్నికల్లో బంపర్ మెజారిటీని సాధించి రెండోసారి కూడా సీఎం అయిపోయారు. అయితే పదేళ్ల పాలన తరువాత 2023లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఆయన పార్టీ బొక్కా బోర్లా పడ్డారు. కేవలం 37 శాతం ఓటల్తఒ 39 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్ తరఫున గెలిచారు. అదే పరాభవం అనుకుంటే 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఒక్క ఎంపీ సీటూ బీఆర్ఎస్ కి దక్కలేదు. ఇక బీఆర్ఎస్ కి ఓటు షేర్ కేవలం 17 శాతమే లభించింది. అంటే ఆరు నెలల తేడాతో 20 శాతం ఓటింగ్ పోయింది అన్న మాట.

ఇంత జరిగిన తరువాత కూడా కేసీఆర్ మీద కానీ కేటీఆర్ బీఆర్ఎస్ మీద కానీ ఎందుకు ఎందుకు సానుభూతి లేదు అంటే కేసీఆర్ ఫార్మ్ హౌజ్ కే పరిమితం కావడం ఆయన ప్రజలతో మమేకం కాకపోవడం అన్న విమర్శలు ఉన్నాయి. ఇక గద్దర్ వంటి ప్రజా గాయకులను దూరం పెట్టడం కోదండరాం లాంటి ప్రజా నాయకులను దూరం చేసుకోవడం ఇలా తెలంగాణా ఉద్యమంలో తన వెంట ఉన్న వారిని అందరినీ దూరం పెట్టి పూర్తిగా కుటుంబ పాలన చేశారు అన్న చెడ్డ పేరు తెచ్చుకున్నారు.

తండ్రీ కొడుకులే బీఆర్ఎస్ అంటే అన్న అర్ధం వచ్చేలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాగే కూతురు, మేనల్లుడు మొత్తం కేసీఅర్ ఫ్యామిలీగానే పాలన సాగిపోయింది అన్న కామెంట్స్ వచ్చిపడ్డాయి. అదే సమయంలో ప్రజల దగ్గరకు పార్టీని తీసుకుని వెళ్ళి కేసీఆర్ పాలన మీద ఉద్యమించిన రేవన్ రెడ్డి కష్టానికి తగిన ఫలం లభించింది. కాంగ్రెస్ కి 40 శాతం ఓటు షేర్ తో 64 సీట్లు గెలించింది.

ఇక రేవంత్ రెడ్డి గెలిచిన తరువాత వివిధ శాఖలను సంబంధించి శ్వేత పత్రాలను ప్రతీ రోజూ రిలీజ్ చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలన తీరుని ప్రజల సాక్షింగా ఆయన సాధికారికంగా ఎండగట్టారు. దాంతో కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏమి చేశారో ప్రజలకు పూర్తిగా అర్ధం అయింది అంటున్నారు.

ఇక ఏపీ విషయానికి వస్తే వైఎస్ జగన్ వైఎస్సార్ మరణాంతరం వెలుగులోకి వచ్చారు ఓదార్పు యాత్రకు సోనియా గాంధీ అనుమతి ఇవ్వలేదని సొంతంగా పార్టీ పెట్టి జైలుకు కూడా వెళ్లారు. అలా అక్రమ ఆస్తుల కేసులో పదహారు నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. దాంతో 2014 ఎన్నికల్లో 67 అసెంబ్లీ సీట్లు వైసీపీకి సాధించి పెట్టి అధికారానికి చాలా దగ్గరగా వచ్చారు.

ఇక 2019 ఎన్నికల ముందు రెండేళ్ళ పాటు పాదయాత్ర చేసి జనంతో పాటే అన్నట్లుగా తిరిగారు. అలా 50 శాతం ఓటు షేర్ తో 151 సీట్లతో భారీ ఎత్తున ప్రజాదరణను చూరగొని అధికారంలోకి వచ్చారు జగన్. ఇలా చూస్తే గిర్రున అయిదేళ్ళ కాలం తిరిగేసరికి 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీతో పాటుగా జగన్ బొక్కబోర్లా పడ్డారు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా కేవలం 11 ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇక అధికారంలోకి జగన్ వచ్చాక ప్రజలము మెప్పించేలా పాలన చేయకుండా అప్పులు చేసి బటన్ నొక్కుతూ సంక్షేమం అంటూ ముందుకు పోయారు. ఎవరి సలహాలు అసలు వినకుండా జగన్ సొంత నిర్ణయాలతోనే పాలన చేశారు. తన సొంత మీడియాకు ప్రభుత్వం ద్వారానే సాలరీస్ ఇచ్చారన్న ఆరోపణలూ ఎదుర్కొన్నారు.

ఆఖరుకు ఎమ్మెల్యేలను సైతం కలవకుండా నేను బటన్ నొక్కుతున్నాను ఓట్లు పడతాయని భ్రమించారు. ఇక విపక్షం మీద ఇష్టం వచ్చినట్లుగా కేసులు పెడుతూ వేధింపులకు గురి చేశారు. రోడ్లు వేయకుండా అభివృద్ధి అన్నది చేయకుండా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసారని ఘాటు విమర్శలు ఎదుర్కొన్నారు.

రాజకీయ అనుభవం లేని సజ్జల రామక్రిష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ఉన్నతధికారి ధనుంజయ్ రెడ్డిని పెట్టుకుని బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ అక్కడే ఆఫీస్ పెట్టి అంతా అయిదేళ్ళ పాలన చేశారు. ఏకంగా 986 మందిని సెక్యూరిటీగా పెట్టుకుని రాష్ట్రమంతా తన ఎస్టేట్ గా పాలన చేస్తున్న జగన్ విధానాలను నిరసిస్తూ ప్రజలు అంతా గట్టిగా బుద్ధి చెప్పారు అని అంటున్నారు.

అందువల్లనే ఇపుడు అసలు ఎక్కడా ఏ మాత్రం సానుభూతి రావడం లేదు అని అంటున్నారు. పార్టీ క్యాడర్ కి సైతం ఏమీ చేయకుండా పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని అంటున్నారు. ఆఖరుకు తన సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా 250 కోట్ల రూపాయల పనులకు బిల్లుకు చెల్లించకుండా పోవడం అంటే అది పరాకాష్ట అని అంటున్నారు. దీనిని బట్టి క్యాడర్ కి జగన్ ఏమి చేసినట్లు అని ప్రశ్నిస్తున్నారు.

సీఎం హోదాలో జగన్ అనుకుంటే 250 కోట్లు బిల్లులు క్లియర్ చేయడమొక లెక్కా అని అంటున్నారు.2.66 కోట్ల రూపాయలను పంచిన సీఎం సొంత నియోజకవర్గంలో బిల్లులు మాత్రం క్లియర్ చేయలేదు అని అంటున్నారు. ఇక తల్లిని చెల్లిని పక్కన పెట్టి అంతా తానే అయి నా బొమ్మ చూస్తే ఓట్లు వేస్తారు అని అనుకుంటూ భ్రమలలో ఉన్న జగన్ కి దిమ్మ తిరిగే తీర్పుతో జనాలు గుణపాఠం చెప్పారు అని అంటున్నారు. రాజకీయ అనుభవ లేమి అహంకారంతో చేసిన పాలన వల్లనే జగన్ కి సానుభూతి దక్కడం లేదు అని అంటున్నారు.

Tags:    

Similar News

eac