రిటైర్ అయిన వారికి 11‌00 అక్రమ అపాయింట్మెంట్లు

అయితే తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవటం అన్నది సలహాదారుల రూపంలో ఉంటుంది కాని రిటైర్ అయిన పోస్టులోనే వాళ్ళకి రీ అపాయిట్మెంట్ ఇచ్చి కంటిన్యు చేయటం అన్నది ఉండదు.

Update: 2024-01-20 05:11 GMT

కేసీయార్ పాలనలోని ఒక్కో విషయం బయటపడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు ఆశ్చర్యపోతున్నారు. పదేళ్ళల్లో జరిగిన అనేక అవకతవకల్లో రిటైర్ అయినవాళ్ళకి రీ అపాయిట్మెంట్ లేదా రీ పోస్టింగ్ ఇవ్వటం కూడా ఒకటి. వివిధ శాఖల్లో అనేక హోదాల్లో రిటైర్ అయిన వాళ్ళని గౌరవంగా సాగనంపకుండా వాళ్ళలో కొందరికి కేసీయార్ ప్రభుత్వం రీ అపాయిట్మెంట్ ఇచ్చింది. రిటైర్ అయిన వాళ్ళు పర్టిక్యులర్ ఫీల్డులో బాగా నిపుణులు అయినపుడు అంతటి నిపుణులు అందబాటులో లేనపుడు రిటైర్ అయిన వాళ్ళని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోవటం మామూలే.

అయితే తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవటం అన్నది సలహాదారుల రూపంలో ఉంటుంది కాని రిటైర్ అయిన పోస్టులోనే వాళ్ళకి రీ అపాయిట్మెంట్ ఇచ్చి కంటిన్యు చేయటం అన్నది ఉండదు. కానీ కేసీయార్ అలాంటి రీ అపాయిట్మెంట్లు ఐదుగురు ఐఏఎస్ లకు ఇచ్చినట్లు బయటపడింది. ఇలాంటి రీ అపాయిట్మెంట్లు ఇంకా ఎన్ని ఉన్నాయనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లెక్కలు తీయమని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. దాంతో అన్నీ శాఖల్లో రీ అపాయిట్మెంట్ వివరాలు సేకరిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం రీ అపాయిట్మెంట్లు సుమారు 1100 దాకా బయటపడ్డాయట. మున్సిపల్ శాఖలో అత్యధికంగా 180 మంది రీ అపాయిట్మెంట్ అయినట్లు తెలిసింది. సివిల్ సప్లైస్, హయ్యర్ ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ తదితర శాఖల్లో రీ అపాయిట్మెంట్లు ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు బట్టి తెలుస్తోంది. మొత్తం 32 విభాగాల్లో 1100 మంది రీ అపాయిట్మెంట్లు పొందినట్లు సమాచారం.

మున్సిపల్ శాఖలో 180, సివిల్ సప్లైస్ లో 88, హయ్యర్ ఎడ్యుకేషన్లో 77, ఇరిగేషన్లో 74, ఆర్ అండ్ బీలో 63 మంది వర్కచేస్తున్నట్లు బయటపడింది. ఇంకా చాలా విభాగాల్లో పదుల సంఖ్యలో ఇలాంటి రీ అపాయిట్మెంట్లు బయటపడుతున్నాయి. మొత్తం కసరత్తు అయ్యేటప్పటికి ఇంకెంతమంది వివరాలు తెలుస్తాయో. ఒక్కోరు సగటున నెలకు లక్ష రూపాయలు జీతం అందుకుంటున్నారు. విభాగాల వారీగా మొత్తం వివరాలు అందితే కాని ఈ రీఅపాయిట్మెంట్ల కుంభకోణం లెక్కతేలదు.

Tags:    

Similar News