హిమాన్షు బర్త్ డే వేడుకల్లో కేసీఆర్!

ఈ సమయంలో తాజాగా కేసీఆర్ కాస్త హుషారుగా కనిపించిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.

Update: 2024-07-12 16:45 GMT

తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ ప్రజలకు కనిపించడం చాలా అరుదుగా మారిన సంగతి తెలిసిందే. తర్వాత అనారోగ్యం పాలవ్వడం.. అనంతరం తేరుకున్న తర్వాత పల్లెల్లో పర్యటించారు! కానీ... రెగ్యులర్ గా ఆయన దర్శన భాగ్యం కలగడం లేదనేది ఆయన అభిమానులు, బీఆరెస్స్ కార్యకర్తల మనసులో మాటగా చెబుతుంటారు!

పైగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకపోవడంతో కేసీఆర్ మైకుల ముందు మాట్లాడి ఎంతో కాలం అయిపోయినట్లుగా ఆయన అభిమానులు హర్ట్ అవుతున్నారని అంటున్నారు. ఆయనకు సంబంధించిన అప్ డేట్స్ ఆల్ మోస్ట్ ఆగిపోయాయని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా కేసీఆర్ కాస్త హుషారుగా కనిపించిన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.

తాజాగా కేసీఆర్ కాస్త హుషారుగా కనిపించిన ఫోటోలు తెరపైకి వచ్చాయి. అందుకు కారణం తన మనవడు హిమాన్షు బర్త్ డేనే! హిమాన్షు బర్త్ డే కావడంతో కేసీఆర్ కాస్త హుషారుగా కనిపించారు. ఈ సందర్భంగా తన మనవడికి బర్త్ డే కేక్ తినిపించి ఆశీర్వదించారు. ఈ వేడుకలు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో జరిగాయి.

అవును... హిమాన్షు బర్త్ డే కావడంతో శుక్రవారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మనవడికి కేక్ తినిపించిన కేసీఆర్... శతమానం భవతి అని ఆశీర్వదించారు. ఈ వేడుకలకు సంబంధించి కేసీఆర్ పాల్గొన్న ఫోటోలు హిమాన్షు తన "ఎక్స్"లో పోస్ట్ చేశారు.

ఈ వేడుకల అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు హిమాన్షు మొక్కను నాటారు. ఈ జన్మదిన వేడుకల్లో కేసీఆర్ దంపతులతో పాటు కేటీఆర్ దంపతులు, అమ్మమ్మ శశికళ సహా పలువురు కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు!

Tags:    

Similar News