సెంటిమెంట్ ను ఫాలో కాకుండా అసెంబ్లీకి కేసీఆర్

మాజీ హోం మంత్రి మహమూద్ ఆలీ.. ఆయన భుజానికి దట్టీ కడుతుంటారు.

Update: 2024-07-26 11:30 GMT

గులాబీ అధిపతి.. తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నేత కేసీఆర్ కు నమ్మకాలు.. విశ్వాసాలు ఎంత ఎక్కువన్న విషయం అందరికి తెలిసిందే. కొన్ని విషయాల్లో ఆయన అనుసరించే నమ్మకాలు నవ్వు తెప్పించినా..ఆయన మాత్రం సీరియస్ గా వాటిని ఫాలో అవుతుంటారు. ఎవరేం అనుకున్నా తాను అనుకున్నది మాత్రమే చేసే కేసీఆర్ తాజాగా మాత్రం రోటీన్ కు భిన్నంగా వ్యవహరించటం ఆసక్తికరంగా మారింది.

అధికారం చేజారి.. విపక్ష నేత హోదాలో అసెంబ్లీ సమావేశాలకు మొదటిసారి హాజరయ్యే వేళలో ఆయన కీలక సెంటిమెంట్ ను ఫాలో కావటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఉద్యమ కాలం నుంచి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం చేపట్టినా.. పని మీద వెళుతున్నా.. ఆయన తన చేతికి దట్టీ కట్టించుకోవటం తెలిసిందే. బహిరంగ సభలు.. ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో పాటు.. పార్టీ కీలక కార్యక్రమాల వేళలోనూ ఆయన భుజానికి కట్టించుకునే దట్టీతో ఆయన ప్రత్యేకంగా కనిపిస్తుంటారు.

మాజీ హోం మంత్రి మహమూద్ ఆలీ.. ఆయన భుజానికి దట్టీ కడుతుంటారు. ఆయన చేత కట్టించుకోవటం కేసీఆర్ కు ఒక సెంటిమెంట్ గా చెబుతారు. ఈ కారణంగా ఏదైనా కీలక కార్యక్రమం షురూ అవుతున్న వేళ.. మహమూద్ అలీ కేసీఆర్ నివాసానికి వెళ్లటం.. ఆయన ఇంట్లో నుంచి బయలుదేరే వేళలో చేతికి కట్టటం అలవాటు. ఒకవేళ అలాంటిది కుదరకుంటే.. పార్టీ కార్యాలయంలోనో.. ఇతర ప్రాంతాల్లోనూ ఆయన దట్టి కట్టిన సందర్భాలు ఉన్నాయి. అలా ఏళ్లకు ఏళ్లుగా ఫాలో అవుతున్న సెంటిమెంట్ కు భిన్నంగా వ్యవహరించిన వైనం ఆసక్తికరంగా మారింది.

అసెంబ్లీకి మొదటిసారి వెళ్లిన సందర్భంగా ఇంటికి రావాల్సిన మహమూద్ అలీ రాకపోవటం ఒక ఎత్తు అయితే.. అసెంబ్లీ సమావేశ హాల్లోకి ప్రవేశ పెట్టే వేళలోనూ ఆయన భుజానికి ఉండాల్సిన దట్టీ కనిపించలేదు. అంతేకాదు.. మహమూద్ అలీ కూడా కనిపించలేదు. సీఎంగా ఉన్న వేళ.. అనేక కార్యక్రమాలకు సెంటిమెంట్ గా ఫాలో అయిన దానికి భిన్నంగా కేసీఆర్ వ్యవహారశైలి ఉండటం చూస్తే.. కొత్త కేసీఆర్ అన్న భావన వ్యక్తమవుతోంది. ఏమైనా.. సెంటిమెంట్ ను ఫాలో అయ్యే పెద్దమనిషి అందుకు భిన్నంగా వ్యవహరించటం గమనార్హం.

Tags:    

Similar News