జంపింగ్ లకు టికెట్లతో ఆ పార్టీ అధినేత అడ్డుకట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. లోక్ సభ ఎన్నికల ముంగిట పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి

Update: 2024-03-14 02:30 GMT
జంపింగ్ లకు టికెట్లతో ఆ పార్టీ అధినేత అడ్డుకట్
  • whatsapp icon

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. లోక్ సభ ఎన్నికల ముంగిట పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లొ ఊహించిని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. లోక్ సభ ఎన్నికలు అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీ మూడింటికీ కీలకమే. బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవాలంటే కనీస సంఖ్యలో అయినా సీట్లు నెగ్గాలి. బీజేపీకి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణ సీట్లు ముఖ్యం కాకున్నా.. తాము రాష్ట్రంలో అధికారంలో వస్తామనే మాటలను ప్రజలు నమ్మేందుకు ఎక్కువ సీట్లు నెగ్గాలి. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉంటూ మెరుగైన సంఖ్యలో స్థానాలు తెచ్చుకోకుంటే ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది.

వెళ్లిపోయేవారిని ఆపేందుకు..

తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కు గడ్డుకాలం ఎదురవుతోంది. నాయకులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. ముగ్గురు ఎంపీలు కారు దిగారు. ఇదే బాటలో మరికొందరు కూడా ఉన్నారన్న కథనాలు వచ్చాయి. ఇలాగైతే డ్యామేజీ ఎక్కువ అవుతుందని భావించిన బీఆర్ఎస్ అధిష్ఠానం వెళ్లిపోతారు అనుకున్నవారికి ఎంపీ టికెట్లు ఇవ్వడం ద్వారా కట్టడి చేస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఖమ్మం, వరంగల్ లో ఇలా

ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి సిటింగ్ ఎంపీలు నామా నాగేశ్వరరావు (ఖమ్మం), మాలోతు కవిత (మహబూబ్ నగర్) ఉన్నారు. వీరిద్దరూ మరో పార్టీలోకి వెళ్లే యోచనలో ఉన్నారన్న కథనాలు వచ్చాయి. అవేవీ రూడీ కాలేదు. ఈలోగా తొలి జాబితాలోనే బీఆర్ఎస్ ఎంపీ టికెట్లిచ్చింది. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ఊహాగానాలు వ్యాపించాయి. దీంతో ఆయన కుమార్తె కావ్యకు రెండో జాబితాలో వరంగల్ టికెట్ కేటాయించింది.

సిటింగ్ లను కాదని..

చేవెళ్లలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముంగిట టీడీపీ నుంచి చేరిన కాసానికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. సిటింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి మళ్లీ అవకాశం ఇవ్వలేదు. వరంగల్ లో ఎంపీ పసునూరి దయాకర్ ను కాదని కడియం కుమార్తెకు టికెట్ ఇచ్చింది.

Tags:    

Similar News