కాంగ్రెస్ హనుమంత అవతారం....కేసీయార్ అసలు ఊహించలేదా...?

ఇలా హస్తం పార్టీ జాతకం తిరగదు అని అంతా అనుకుంటూంటే ఇంకేముంది మూడవసారి కూడా హ్యాపీగా గెలిచేయవచ్చు అని బీయారెస్ కలలు కన్నది. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాలే టోటల్ పిక్చర్ ని మార్చేశాయి.

Update: 2023-11-04 02:45 GMT

తెలంగాణాలో కాంగ్రెస్ కొద్ది నెలల క్రితం వరకూ అసలు లెక్క చేసేవారు కాదు అనే అంటారు. ఆయనకు బీజేపీతోనే పోటీ అన్నట్లుగానే పొలిటికల్ సీన్ క్రియేట్ అయింది. అలా క్రియేట్ చేశారు అని కూడా చెబుతారు. బీజేపీకి తెలంగాణ వ్యాప్తంగా బలం అయితే లేదు.

దాంతో ఆ పార్టీకి ఊపు ఉందని చెబుతూ కాంగ్రెస్ ని సైడ్ చేస్తూ కమలంతో కలహాన్ని పెట్టుకుని హ్యాట్రిక్ కొట్టాలని కేసీయార్ అనుకునేవారు అంటారు. ఇక కాంగ్రెస్ లో నిస్తేజం ఒక వైపు టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి చేరిన రేవంత్ రెడ్డి అంటే సీనియర్లకు మంటగా ఉండడంతో ఆ పార్టీ ఎప్పటికి ఎత్తిగిల్లేను అని కూడా పరిస్థితి ఉండేది.

ఇలా హస్తం పార్టీ జాతకం తిరగదు అని అంతా అనుకుంటూంటే ఇంకేముంది మూడవసారి కూడా హ్యాపీగా గెలిచేయవచ్చు అని బీయారెస్ కలలు కన్నది. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాలే టోటల్ పిక్చర్ ని మార్చేశాయి. దీనికంటే ముందు రాహుల్ గాంధీ గత ఏడాది తెలంగాణా మీదుగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కూడా కాంగ్రెస్ ని తట్టి లేపింది.

నిజానికి కాంగ్రెస్ బలం అంతా నీటిలో మొసలికి ఉన్న బలమే. ఆ బలమే ఇపుడు సరిగ్గా ఎన్నికల సమయంలో ఉపయోగపడుతోంది. ఎంత బలం ఉన్నా కాంగ్రెస్ కి ఉన్న చిన్న బలహీనతలు వర్గ పోరు. దాంతోనే ఆ పార్టీ ఇబ్బందులు పడుతూ వచ్చింది. కానీ ఇపుడు చూస్తే కాంగ్రెస్ లో ఎన్నడూ లేని ఐక్యత కనిపిస్తోంది. ఇది కనీసం ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి పీఠం ఎక్కేంతవరకూ సాగుతుంది అని చెప్పవచ్చు.

హైకమాండ్ కూడా అదే కోరుకుంటోంది అని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ వ్యూహం ఫలించింది పార్టీ ఒక్కటైంది. ఢిల్లీ నాయకత్వం క్లోజ్ మానిటరింగ్ తో కాంగ్రెస్ పార్టీ ఇపుడు ఎన్నికల్లో గ్రాఫ్ ఒక్కసారిగా పెంచుకుంది. ఇక ఎన్నడూ లేని విధంగా విపక్షాలు ఒక్కోటిగా కాంగ్రెస్ గెలుపు కోసం తామే ముందుకు రావడం.

నిన్నటికి నిన్న టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడం కాంగ్రెస్ కి వేయి ఏనుగుల బలం ఇచ్చినట్లే. ఇపుడు చూస్తే వైఎస్సార్టీపీ కూడా ఎన్నికలకు దూరంగా ఉంటామని చెప్పి కాంగ్రెస్ కి సంతోషాన్ని ఇచ్చింది. దీంతో ఇలా మద్దతు అంతకంతకూ రాజకీయంగానే కాదు జనంలోనూ పెరుగుతూండడంతో కేసీయార్ సహా బీయారెస్ నేతలలో ఒకింత కలవరం రేపీలా ఉందని అంటున్నారు.

ఇక బీజేపీ చూస్తే అంతకంతకు బలహీనపడిపోతోంది. అలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక ముప్పు తగ్గిపోతోంది. బీజేపీ నామినేషన్ల ముందే ఇంతలా చప్పబడిపోతూండడం కూడా బీయారెస్ ఊహించలేదు అని అంటున్నారు. ఈ నేపధ్యం చూస్తే బీయారెస్ వ్యతిరేక ఓట్లు గుత్తమొత్తంగా కాంగ్రెస్ కే పడే పరిస్థితి కనిపిస్తోంది అని అంటున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఒడిసిపట్టడంలో కాంగ్రెస్ ఇప్పటికే చాలా వరకూ విజయం సాధించేసింది అని అంటున్నారు. వామపక్షాలను కూడా చివరి నిముషంలో తమ దారికి తెస్తామన్న ధీమా కూడా కాంగ్రెస్ లో కనిపిస్తోంది. కేంద్ర నాయకత్వం వారితో చర్చలు జరుపుతోంది. ఎట్టి పరిస్థితులల్లోనూ ఇంతటి ఊపు ఉన్న వేళ ఏ చిన్న అవకాశాన్ని దూరం చేసుకోకూడదు అన్నదే కాంగ్రెస్ వ్యూహం.

చిన్న పార్టీ పెద్ద పార్టీ అని కాదు, వారి వెనక ఒక్క ఓటు ఉన్నా తన వైపు తిరగాలి ఇదే స్ట్రాటజీతో కాంగ్రెస్ భేషజాలు అన్నీ విడిచిపెట్టి మరీ విపక్షాలతో కొత్త బంధాలు తెర ముందూ వెనకా వేసుకుని ముందుకు సాగుతోంది అని అంటున్నారు. సరిగ్గా ఈ పరిణామాలే ఇపుడు బీయారెస్ లో భయాలు కలిగిస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేక ఓటు అంతా కాంగ్రెస్ కే చేరితే కచ్చితంగా అది బీయారెస్ కి దెబ్బ పడేలా చేయవచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News