రుణమాఫీపై చేతులెత్తేశారా ?
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నవంబర్-డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయని కేసీయార్ కు బాగా తెలుసు.
రుణమాఫీ చేయటంలో కేసీయార్ చేతులెత్తేశారు. నిర్మల్ బహిరంగసభలో మాట్లాడుతు రైతు రుణమాఫీ చేద్దామని ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా కేంద్ర ఎన్నికల కమీషన్ నిబంధనలు అడ్డుకుంటున్నట్లు చెప్పారు. రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో వేయటానికి అనుమతించాలని కమీషన్ను ప్రభుత్వం అడిగిందని చెప్పారు. కమీషన్ అంగీకరిస్తే వెంటనే డబ్బులు ఖాతాల్లో వేస్తామని లేకపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత వేస్తామని కేసీయార్ చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నవంబర్-డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయని కేసీయార్ కు బాగా తెలుసు. ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్లోనే రిలీజవబోతోందని కూడా సమాచారం ఉంది. ఎన్నికల విషయంలో ఇంత స్పష్టమైన సమాచారం ఉన్నపుడు రైతు రుణమాఫీ ఇంకా ముందే ఎందుకు చేయలేదు ? 2018 ఎన్నికల హామీని అసలు ఇంతవరకు ఎందుకని సంపూర్ణంగా అమలుచేయలేదు ? ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇపుడు కమీషన్ కు లేఖ రాయటం ఏమిటి ?
ఇదంతా కేసీయార్ డ్రామా అని తెలిసిపోతోంది. రైతురుణమాఫీ సంపూర్ణంగా జరగకపోతే ఎన్నికల్లో రైతుల రియాక్షన్ ఎలాగుంటుందో కేసీయార్ కు బాగా తెలుసు. అందుకనే ఇంతకాలం పెండింగులో పెట్టిన రుణమాఫీ హామీపై సడెన్ గా ఓ రెండునెలల ముందు హడావుడి మొదలుపెట్టారు. ఎక్కడెక్కడి ఆదాయాలను రుణమాఫీ కోసం డైవర్టుచేశారు. అయితే ఎంత డైవర్టుచేసినా ఇంకా సుమారు రు. 8 వేల కోట్లు మాఫీ పెండింగులో ఉండిపోయిందట. రు. 8 వేల కోట్లంటే కొన్ని లక్షల మంది రైతులుంటారు. వీళ్ళంతా కేసీయార్ ప్రభుత్వంపై మండిపోతుంటారు.
వాళ్ళ ఆగ్రహాన్ని చల్లార్చేందుకే రుణమాపీ హామీని అమలు చేయాలని కోరుతు కమీషన్ కు లేఖ రాశారు. ఎలాగూ కమీషన్ అంగీకరించదని తెలుసు. ఒక కమీషన్ అంగీకరిస్తే ఆ నిధులు సమీకరించి రైతుల ఖాతాల్లో వేసేట్లు, అంగీకరించకపోతే నెపాన్ని కమీషన్ మీద తోసేసేట్లుగా కేసీయార్ ప్లాన్ చేసుకున్నారు. ముందుగా అనుకున్నట్లే రుణమాఫీ చేయలేకపోతున్న కారణాన్ని ఎన్నికల కమీషన్ మీద నెట్టేశారు. రుణమాఫీ పైన కేసీయార్ కు చిత్తశుద్దుంటే ఎప్పుడో చేసేవారే. అయినా ఇంతకాలం పెండింగులో పెట్టారంటేనే ఎన్నికల జిమ్మిక్కులని అర్ధమైపోతోంది.