కేదార్ మరణం అగ్రహీరోలకు షాకింగ్ గా మారిందా?

దుబాయ్ లో మరణించిన టాలీవుడ్ నిర్మాత కేదార్ మరణం తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్రహీరోలకు షాకింగ్ గా మారిందా? అన్నదిప్పుడు చర్చగా మారింది.

Update: 2025-02-27 04:45 GMT

దుబాయ్ లో మరణించిన టాలీవుడ్ నిర్మాత కేదార్ మరణం తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్రహీరోలకు షాకింగ్ గా మారిందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఈ వాదనకు బలం చేకూరేలా అగ్ర మీడియా సంస్థలు సైతం కథనాలు ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి కేదార్ పెద్ద నిర్మాత ఏం కాదు. ఆ మాటకు వస్తే ఆయన తీసినవి రెండు..మూడు సినిమాలు మాత్రమే. అవి కూడా ఒక మోస్తరు బడ్జెట్ తోనూ.. చిన్నపాటి కథానాయకులతోనే తప్పించి.. క్రేజీ ప్రాజెక్టుల్ని తెరకెక్కించింది లేదు. అలాంటప్పుడు కేదార్ మరణం టాలీవుడ్ అగ్రహీరోలకు ఉలికిపాటుకు గురి చేయటమే కాదు.. ఇప్పుడేం చేయాలి? అన్న సందిగ్థంలో వారున్నట్లుగా చెబుతున్నారు.

దీనికి కారణం దుబాయ్ స్థిరాస్తి రంగాల్లో కేదార్ వ్యాపారాలు ఉండటం.. పలు కంపెనీలకు డైరెక్టర్ గా ఉండటమేకాదు.. వాటిల్లో పెట్టిన కోట్ల పెట్టుబడుల్లో పలువురు అగ్రహీరోలు.. నిర్మాతలు.. దర్శకులతో పాటు.. ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఉండటమే కారణమని తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖుల గుండెల్లో కేదార్ మరణం రైళ్లు పరిగెత్తేలా చేస్తుందన్నది ఇప్పుడు ప్రచారం సాగుతోంది.

దీనికికారణం కేదార్ కు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి దుబాయ్ లో పెట్టుబడులు పెట్టించారని. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలు అతడి వద్దే ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో.. మింగాలేక కక్కాలేని చిత్రమైన పరిస్థితుల్లో వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. పలువరు అగ్రశ్రేణి హీరోలకు.. దర్శక నిర్మాతలకు కేదార్ బినామీగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. అనూహ్య రీతిలో కేదార్ మరణించిన నేపథ్యంలో అతడికి ఇచ్చిన పెట్టుబడి లెక్కల్ని ఎలా తేల్చుకోవలన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నట్లుగా చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News