కేజ్రీవాల్ అరెస్ట్ పై జర్మనీకి భారత్ హెచ్చరిక

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం రగడగా మారుతోంది. దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా కేజ్రీవాల్ అరెస్ట్ పై దుమారం రేగుతోంది

Update: 2024-03-23 09:47 GMT

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం రగడగా మారుతోంది. దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా కేజ్రీవాల్ అరెస్ట్ పై దుమారం రేగుతోంది. తాజాగా జర్మనీ ఆయన అరెస్ట్ అక్రమమని తన నిర్ణయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేసింది. దీంతో భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం జర్మనీకి లేదని ప్రకటించింది. ఈ మేరకు జర్మనీ రాయబారిని పిలిపించి తమ నిరసనను వ్యక్తం చేసింది. జర్మనీ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని సూచించింది.

భారత్ ప్రజాస్వామ్య దేశం. స్వయంప్రతిపత్తి కలిగిన దేశం కావడంతో ప్రజాస్వామ్య సూత్రాలు మనకు ప్రత్యేకంగా ఉన్నాయి. నిష్పక్షపాత ధోరణి, న్యాయ విచారణ కోసమే అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయకతప్పలేదు. అతడు దోషిగా తేలనంత వరకు అదుపులోకి తీసుకోలేదు. అతడిపై నేరారోపణ రుజువైన తరువాతే అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి జర్మనీ గురవుతోంది.

లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న అరెస్ట్ చేసింది. దీంతో కోర్టు ఆరు రోజుల కస్టడీకి తరలించింది. దీనిపై ఆప్ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 26న ప్రధాని ఇంటిని ముట్టడిస్తామని ఆప్ ప్రకటించిన నేపథ్యంలో కేజ్రీవాల్ ను విచారణ జరిపి నేరాలు రుజువైతే శిక్ష విధించే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు సూచిస్తున్నారు.

ఆప్ స్వచ్ఛమైన పార్టీ అని గొప్పలు చెప్పుకోవడంతో పంజాబ్ లోనూ అధికారం చేజిక్కించుకుంది. ఇప్పుడు ఆ పార్టీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ తో అలజడి రేగుతోంది. ఇన్నాళ్లు అవినీతి లేని పార్టీగా గుర్తింపు సాధించినా చివరకు తన అవినీతి బాగోతం బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. బీజేపీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పకున్న పార్టీకి ప్రస్తుతం కష్టాలు మొదలయ్యాయి.

దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఆప్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతోంది. ఢిల్లీ కేంద్రంగా నిరసనలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఆప్ నేతల నిరసనల మధ్య ఆయన అరెస్ట్ పై ఆగ్రహ జ్వాలలు పెరుగుతాయని అంటున్నారు. కానీ నేరం చేసిన వాళ్లు ఎంతటి వారైనా శిక్షకు అర్హులే అనే కోణంలో విచారణ కొనసాగించనున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News