నిన్న షమీ.. నేడు రోహిత్... ఈ పో*ర్న్ స్టార్ సపోర్ట్ వైరల్!
ఇందులో భాగంగా... ‘నువ్వు భారత క్రికెట్ ప్రపంచానికి సూపర్ స్టార్ వి రోహిత్ శర్మ.. స్ట్రాంగ్ గా ఉండు’ అంటూ ఆమె పోస్ట్ చేశారు.
ఐపీఎల్ 2022లో తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను గుజరాత్ టైటాన్స్ ఓడించింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహ్మద్ షమీ తన ఫస్ట్ మూడు ఓవర్ల స్పెల్ లో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో... షమీ పెర్ఫార్మెన్స్ పై ఫ్యాన్స్ ప్రశంసల జల్లులు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా షమీ ప్రదర్శనపై పోస్టులు వైరల్ చేశారు.
ఈ సమయంలో ఎవరూ ఊహించని వ్యక్తి నుంచి నాడు షమీకి ప్రశంసలు దక్కాయి. ఇందులో భాగంగా... అమెరికా పోర్న్ స్టార్ కేండ్ర లస్ట్ షమీని అభినందించింది. ఆ పోస్ట్ నాడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సమయంలో తాజాగా రోహిత్ శర్మకు మద్దతుగా ఆమె మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.
అవును... బోర్డర్-గవస్కర్ ట్రోఫీ అయిదో మ్యాచ్ లో తనకు తాను విశ్రాంతి తీసుకున్న నేపథ్యంలో బాక్సింగ్ డే టెస్టు రోహిత్ శర్మకు చివరి ప్రదర్శనగా భావిస్తున్నట్లు దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవస్కర్, రవిశాస్త్రి అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ నడించింది.
దీనిపై స్పందించిన రోహిత్ శర్మ... తాను రిటైర్మెంట్ తీసుకోవడం లేదని.. తనకు జట్టు అవసరాలే ముఖ్యమని.. అందుకోసమే తాను సిడ్నీ టెస్టు నుంచి తాను తప్పుకున్నానని.. ల్యాప్ ట్యాప్ లు, పెన్నులు, పేపర్లు ముందేసుకుని తను ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలి, ఎప్పుడు ఏమి చేయాలి అనేది ఎవరూ నిర్ణయించలేరని ఘాటుగా స్పందించాడు.
అయినప్పటికీ బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ లో వచ్చిన ఫలితాల నేపథ్యంలోనో ఏమో కానీ.. రోహిత్ శర్మకు పెద్దగా సానుభూతి లభించలేదనే కామెంట్లు వినిపించాయి. అయితే... ఎవరూ ఊహించని రీతిలో రోహిత్ శర్మ కు మద్దతు లభించింది. ఇందులో భాగంగా... అమెరికన్ అడల్ట్ స్టార్ కేండ్ర లస్ట్ స్పందించారు. హిట్ మ్యాన్ కు మద్దతుగా నిలిచారు.
ఇందులో భాగంగా... ‘నువ్వు భారత క్రికెట్ ప్రపంచానికి సూపర్ స్టార్ వి రోహిత్ శర్మ.. స్ట్రాంగ్ గా ఉండు’ అంటూ ఆమె పోస్ట్ చేశారు. దీంతో... సోషల్ మీడియా వేదికగా ఈమె రియాక్షన్ పై సరికొత్త చర్చకు తెరలేపుతూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇందులో భాగంగా... ఇది రోహిత్, అతని వైఫ్ యొక్క పీఆర్ స్టంట్ అంటూ స్పందిస్తున్నారు.
ఇందులో భాగంగా... కేంద్ర లస్ట్ కూడా పీఆర్ ప్యాకేజ్ ఒప్పందంలో భాగమైనట్లు కనిపిస్తోందని ఒకరు స్పందించగా.. క్రికెట్ వర్కవుట్ కాకపోతే రోహిత్ కు మరో అంతర్జాతీయ కెరీర్ ఎంపికలు ఉన్నాయి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు! పలు మీమ్స్ ని పోస్ట్ చేస్తున్నారు. దీంతో.. ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.