హైదరాబాద్ లో ట్రైనింగ్ ప్లేన్ నడిపిన కేతిరెడ్డి.. ఇంట్రస్టింగ్ వీడియో!
వైసీపీ కీలక నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కొత్తగా కనిపించారు.;

సాధారణంగా ప్రజలకు, సమాజానికి కేవలం రాజకీయ నాయకుల్లా మాత్రమే కనిపించే కొంతమంది వెనుక ప్రపంచానికి తెలియని టాలెంట్స్ ఉంటాయి! అయితే.. అవి బయటకు తెలిసినప్పుడు ఆశ్చర్యపోవడం అభిమానుల వంతవుతుంది! ఈ నేపథ్యంలో తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పైలట్ అవతారం ఎత్తిన విషయం తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... వైసీపీ కీలక నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కొత్తగా కనిపించారు. "గుడ్ మార్నింగ్ ధర్మవరం" కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేతిరెడ్డి.. తాజాగా పైలట్ అవతారం ఎత్తారు. హైదరాబాద్ లో ట్రైనింగ్ ప్లేన్ నడిపి.. దానికి సంబంధించిన విషయాలు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
కలల నుంచి వాస్తవికత వరకూ... అధికారికంగా పైలట్! అయ్యాను.. ఆకాశం ఇకపై పరిమితి కాదు.. ఇది ప్రారంభం మాత్రమే. ప్రతి సవాలుకు, ప్రతి పాఠంకు, ఈ ప్రయాణంలో తనకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు.. ముందు అంతులేని సాహసాలు ఉన్నాయి. నేను ఒక్కడిని ఆకాశంలో ఎగిరిన తొలి ప్రయాణం ఇదే అంటూ ట్వీట్ చేశారు.
కాగా... కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేల్లో కాస్త వినూత్నంగా కనిపించేవారనే పేరు సంపాదించుకున్నారని అంటారు. ఇందులో భాగంగా.. "గుడ్ మార్నింగ్ ధర్మవరం" కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేతిరెడ్డి.. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
అనంతరం... సోషల్ మీడియా వేదికగా పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ.. సంచలన విషయాలు వెల్లడించేవారు. ఈ సమయంలో తాజాగా పైలట్ అవతారం ఎత్తిన ఆయన.. దానికి సంబంధించిన వీడియోలు షేర్ చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.