ఏబీఎన్ ఆర్కేతో షర్మిళ చర్చలు... కేతిరెడ్డి సంచలన ఆరోపణలు!

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే.

Update: 2024-07-02 09:15 GMT

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని స్థాయిలో అన్నట్లుగా వైసీపీ దెబ్బతింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించి, చారిత్రాత్మక విజయం నమోదు చేసిన ఆ పార్టీ.. ఇటీవల ఎన్నికల్లో మాత్రం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో.. ఓటమికి గల కారణాలు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, మాజీ మంత్రులు విశ్లేషిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఈ స్థాయిలో ఓడిపోవడానికి గల కారణాలు విశ్లేషించారు. ఇందులో భాగంగా... వైసీపీ ఘోర ఓతమికి వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల లు కూడా ఒక ప్రధాన కారణం అంటూ సంచలన కామెంట్ చేశారు.

ఇందులో భాగంగా... వైఎస్ విజయమ్మ కానీ, షర్మిల కానీ పెద్ద తప్పు చేశారని చెప్పిన కేతిరెడ్డి... నాడు వైఎస్ కుటుంబానికి అన్యాయం జరిగిందని రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్ ను వదిలి వైసీపీలోకి వచ్చారని అన్నారు. ఆ సమయంలో జగన్ జైల్లో ఉంటే షర్మిళ, విజయమ్మ ఫైట్ చేశారని గుర్తుచేశారు. అప్పుడు విజయం దక్కకపోయినా తర్వాత వైసీపీ రూలింగ్ లోకి వచ్చిందని అన్నారు.

ఈ నేపథ్యంలో అన్నతో విభేదించి తెలంగాణకు వెళ్లి పార్టీ పెట్టారు షర్మిళ. అయితే మొదటి నుంచీ వైఎస్ కుటుంబ పతనాన్ని కోరుకున్న ఏబీఎన్ రాధాకృష్ణ, రామోజీరావు షర్మిళ క్రమంగా ట చ్ లో ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్లీనరీ రోజు వైఎస్ విజయమ్మ వైసీపీకి రాజీనామా చేస్తాదనే విషయం ముందే ఆంధ్రజ్యోతిలో హెడ్ లైన్ లో ఎలా వస్తాదని ఆయన ప్రశ్నించారు! షర్మిళ లీకులు ఇవ్వబట్టే వచ్చిందని తెలిపారు.

ఈ సమయంలో షర్మిళ... జగన్ ని డ్యామేజ్ చేస్తున్నానని భావించి ఉండొచ్చు కానీ... ఆ కుటుంబాన్ని నమ్ముకుని ఉన్న లక్షలాది కుటుంబాలను రోడ్డుపాలు చేశారని అన్నారు! ఈ రోజు వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారంటే అందుకు కారణం చంద్రబాబు కాదని.. షర్మిళ అనే తాను చెబుతానని కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసింది చాలా పెద్ద తప్పు అని కేతిరెడ్డి పునరుద్ఘాటించారు!

Tags:    

Similar News

eac