ఏందిది కేతిరెడ్డి.. పెప్పర్ సాల్ట్ లుక్ సూట్ కాలేదట!

ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న వేళలో రాష్ట్రస్థాయిలో బోలెడంత మంది నేతలు పాపులర్ అయినా

Update: 2024-08-01 17:30 GMT

ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న వేళలో రాష్ట్రస్థాయిలో బోలెడంత మంది నేతలు పాపులర్ అయినా.. వాళ్లందరి ఇమేజ్ ఒక ఎత్తు అయితే.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిది మరో ఎత్తుగా చెప్పాలి. గంభీరమైన స్వరంతో పాటు.. కోర మీసాలతో.. క్లీన్ షేవ్ తో.. వైట్ అండ్ వైట్ తో పాటు.. అప్పుడప్పుడు టీషర్టులతో డిఫరెంట్ లుక్ తో దర్శనమిచ్చే ఆయన.. ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక అప్ డేట్ ఇచ్చేవారు.

నిజానికి పలువురు వైసీపీ నేతలు రాష్ట్ర రాజకీయాలు.. ప్రత్యర్థి పార్టీల గురించి మాట్లాడితే.. కేతిరెడ్డి మాత్రం తాను.. తన నియోజకవర్గం మీదనే పోకస్ చేసేవారు. తన ముద్రను స్పష్టంగా వేయటంతో పాటు.. అనంతపురం జిల్లాతో సంబంధం లేకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వారు సైతం కేతిరెడ్డిని ఆసక్తికరంగా ఫాలో అయ్యే ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.

మొన్నీమధ్యన తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఏపీలో పని చేస్తూ.. ప్రజల మధ్య బాగా తిరిగిన కేతిరెడ్డి ఓడిపోవటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్న వ్యాఖ్య చేయటం మర్చిపోకూడదు. నిజానికి కేటీఆర్ ఎప్పుడూ కూడా ధర్మవరం వెళ్లింది లేదు.. కేతిరెడ్డిని వ్యక్తిగతంగా కలిసింది లేదు. కానీ.. సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్ గా ఉన్న తీరు, తనను తాను ప్రచారం చేసుకున్న తీరుకు కేటీఆర్ లాంటోళ్లు సైతం ఎంతలా ప్రభావితం అయ్యారన్న దానికి ఇదో నిదర్శనంగా చెప్పాలి. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో అనునిత్యం ఉదయాన్నే పట్టణంలో తిరుగుతూ అక్కడ ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం గురించి ప్రయత్నం చేసినట్లు కనిపించేవారు.

ఇలా చెప్పుకుంటూ పోతే కేతిరెడ్డి హడావుడికి అంతేలేదు. ఆయన మాటల్లో ఒకలాంటి కమాండ్ కనిపిస్తూ ఉండేది. రాజకీయంగా చూసినా.. ధర్మవరంలో తనకు ఎదురులేకుండా ఉండేందుకు చాలానే ప్రయత్నాలు చేశారు. జేసీ ఫ్యామిలీని ముప్పతిప్పలు పెట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వారు సైతం కేతిరెడ్డిని జిల్లా నుంచి బహిష్రించాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కేతిరెడ్డి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.

ఎమ్మెల్యేగా విపరీతమైన హడావుడి చేసిన ఆయన.. ఎన్నికల్లో ఓటమి తర్వాత మాత్రం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ కనిపించటం మానేశారు. తాజాగా ఒక వీడియోను షేర్ చేశారు. అందులో కూటమి ప్రభుత్వానికి ఏడాది టైం ఇవ్వాలని.. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఆ మాత్రం సమయం అవసరమని పేర్కొనటం ద్వారా ఆసక్తికర చర్చకు తెర తీశారు. అయితే.. ఈ వీడియోలో ఆయన గడ్డం పెరగటం.. సాల్ట్ పెప్పర్ మోడ్ లో ఉన్న ఆయన ముఖం.. అందరికి అలవాటైన దానికి భిన్నంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పాత లుక్కులోనే బాగున్నారన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News