"సంపద సృష్టించడానికి టైం ఇవ్వాలి"... కేతిరెడ్డి హాట్ కామెంట్స్!
అయితే... ఆ వ్యాఖ్యలతో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విభేదిస్తున్నట్లుగా మాట్లాడారు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు మోస్ట్ సీనియర్ లీడర్, ముఖ్యమంత్రిగా 14ఏళ్లు అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారని.. అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా ఆయనకు హామీల అమలు విషయంలో సమయం నెల రోజులు సరిపోతుందని.. హనీమూన్ పిరియడ్ అంటూ ఆరు నెలల సమయం తీసుకుంటే మిగిలినవారికీ, చంద్రబాబుకూ తేడా ఏమిటంటూ వైసీపీ నేతలు కొంతమంది వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే!
అయితే... ఆ వ్యాఖ్యలతో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విభేదిస్తున్నట్లుగా మాట్లాడారు. ఇందులో భాగంగా... ప్రస్తుతం కొలువుదీరిన కూటమి ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నేరవేర్చడానికి కనీసం ఆరు నెలల సమయం అయిన ఇవ్వాలని.. ఈ ఏడాది చివరి వరకూ వేచి చూడాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
అవును... తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేసిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి... ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి జనాలు మ్యాన్ డేట్ ఇచ్చారని అన్నారు. అయితే... కొంతమంది మాత్రం ఈ గెలువు ఈవీఎంల వల్ల వచ్చిందని, 49 లక్షల ఓట్లు మేనిప్యులేట్ అయ్యాయని అంటున్నారని.. దీనిపై కన్ క్లూజన్ కు అన్ని పార్టీలూ మాట్లాడుతున్నాయని తెలిపారు.
ఇందులో భాగంగా అఖిలేష్ యాదవ్ లాంటి వారైతే 80 కి 80 వచ్చినా ఈవీఎం లను నమ్మే పరిస్థితి లేదని అంటున్నారని.. తాను కూడా ఈవీఎంల విషయంలో వారి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు కేతిరెడ్డి తెలిపారు. గతంలో చంద్రబాబు కూడా ఈవీఎంలపై ఆరోపణలు చేశారని.. ఇప్పుడు ఫలితాలు అనుకూలంగా రావడంతో బాగుందని అంటున్నారని కేతిరెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే హామీలపై ఆసక్తికరంగా స్పందించారు.
అయితే... తాము చేసిన పొరపాట్ల వల్లో, చంద్రబాబు ఇచ్చిన హామీల వల్లో వచ్చిన ఫలితాల సంగతి అలా ఉంచితే... చాలా మంది ప్రజానికం ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అంటున్నారని కేతిరెడ్డి అన్నారు. ప్రధానంగా అమ్మఒడి వంటివి తీసేస్తున్నారని అంటున్నారని తెలిపారు. అయితే... అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని మనం అనుకోకూడదని కేతిరెడ్డి సూచించారు.
అందువల్ల... ఈ ఏడాది చివరి వరకూ కూడా వారికి సమయం ఇవ్వాలని అన్నారు. ఎందుకంటే... వాళ్లు సంపద సృష్టించిన తర్వతా ఇస్తామని అన్నారని.. అందువల్ల సంపద సృష్టించడానికి సమయం ఇవ్వాలని.. సంపద సృష్టించిన తర్వాత అప్పుడు పరిస్థితిని బట్టి ఆలోచించడం, మాట్లాడటం చేయొచ్చని తెలిపారు.
ఇక ప్రధానంగా ఇసుక, మద్యం అమ్మకాలు ప్రభుత్వాలు చేయాల్సిన వ్యాపారాలు కాదని.. ప్రభుత్వం పరిపాలన చేయాలి కానీ, వ్యాపారం చేయకూడదని.. అవి చేసినందుకే నేడు వైసీపీకి ఈ ఫలితాలు వచ్చాయన్నట్లుగా స్పందించిన కేతిరెడ్డి... ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా నాడు వైసీపీ చేసిన విధానాలనే అవలంభిస్తుందని అన్నారు!
ఇక తమ ప్రభుత్వం ఉండగా అప్పులు అప్పులు అంటూ నానా రాద్ధాంతం చేశారని కేతిరెడ్డీ గుర్తుచేసుకున్నారు. అయితే... ఈ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా విపరీతంగా అప్పులు చేస్తున్నారని.. ఇందులో భాగంగా కూటమి ఇప్పటికే వివిధ రూపాల్లో సుమారు రూ.32,000 కోట్లు అప్పు తెచ్చారని అన్నారు. మరి ఆ డబ్బులు ఎక్కడ ఖర్చుపెడుతున్నారో తెలియడం లేదని అన్నారు!
https://www.facebook.com/share/v/Qqgf82e2Mfrj479B/