టీడీపీలో కీలక పరిణామాలు... తెలంగాణలో కొత్త అధ్యక్షుడు ఇతనే?

ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించినప్పటికీ... అధ్యక్షుడు లేకుండా పార్టీని అలా అనాధగా వదిలేయడం భావ్యం కాదని బాబు భావించారని అంటున్నారు.

Update: 2023-11-02 06:49 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నన్ని రోజులూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీలో తీవ్ర స్థబ్ధత ఏర్పడిందనేది పరిశీలకులు నొక్కి చెబుతున్న మాట. పార్టీకి సరైన దిశానిర్ధేశం లేక అగమ్యగోచరంగా పరిస్థితి మారిందనే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో 52రోజుల జైలు జీవితం అనంతరం బాబు బయటకు వచ్చారు. మెడికల్ గ్రౌండ్స్ పై మధ్యంతర బెయిల్ లభించడంతో బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

దీంతో... పార్టీలో కొత్త ఉత్సాహం రావడమే కాదు.. కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా మరిముఖ్యంగా తెలంగాణలో పార్టీని కాస్త గాడిలో పెట్టాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించినప్పటికీ... అధ్యక్షుడు లేకుండా పార్టీని అలా అనాధగా వదిలేయడం భావ్యం కాదని బాబు భావించారని అంటున్నారు. ఉన్న కేడర్ మరింత చెల్లాచెదురైపోకుండా హుటాహుటిన ఒక అధ్యక్షుడిని నియమించాలని తలచారని చెబుతున్నారు. ఇందులో భాగంగా ఒక పేరు తెరపైకి వచ్చింది!

అవును... చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయటకొచ్చిన తర్వాత టీడీపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ టీడీపీకి జవసత్వాలు నింపే దిశగా టీడీపీ అధినేత నడుం కట్టినట్టు తెలుస్తోంది! తెలంగాణలో పోటీ చేయకపోవడంతో అది అనైతిక నిర్ణయంగా భావించిన కాసాని జ్ఞానేశ్వర్ టీ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆయన స్థానంలో అరవింద్ కుమార్ గౌడ్ ను నియమించాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో... ఇప్పటికే ఇద్దరు ముగ్గురి పేర్లను పరిశీలించిన టీడీపీ అధిష్టానం.. ఫైనల్ గా అరవింద్ కుమార్ గౌడ్ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. మేనమామ దేవేందర్ గౌడ్ అరవింద్ టీడీపీలో చేరారు! అయితే... దేవేందర్ గౌడ్ పార్టీని వదిలి వెళ్లినప్పటికీ... అరవింద్ మాత్రం టీడీపీలోనే ఉన్నారు. తెలంగాణాలో చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉన్న టీడీపీ నేతల్లో ఆయనకూడా ఒకరని అంటుంటారు.

దీంతో... కాసాని ఖాళీ చేసిన సీటును అరవింద్ గౌడ్ కు ఇవ్వాలని చంద్రబాబు ఫిక్సయ్యారని తెలుస్తుంది. అన్నీ అనుకూలంగా జరిగితే వీలైనంత తొందర్లో ఈ కార్యక్రమం చక్కబెడతారని సమాచారం. నగరానికే చెందిన అరవింద్ మొదటినుండి టీడీపీలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. గతంలో ఎన్నికల సమయాల్లో చాలాసార్లు అతనికి టికెట్ ఇస్తున్నారని ప్రచారం జరగడం.. తర్వాత ఏదో కారణంతో పక్కనపెట్టేయటం తెలిసిందే! ఇంతజరిగినా పార్టీని వదిలిపెట్టలేదు అరవింద్!

దీంతో... ఈ సమయంలో పార్టీలో తాను తీసుకునే ఏ నిర్ణయానికైనా, ఎలాంటి నిర్ణయానికైనా శిరసా వహించేలా పనిచేస్తారని.. అందుకు అరవింద్ నే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే మంచిదని అధినేత భావిస్తున్నారంట. మరి... ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఆ ఎన్నికల్లో పోటీచేయని పార్టీకి అధ్యక్షుడిగా అరవింద్ ఎన్నికైతే... ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.. ఏ విధంగా అధినేత ఆలోచనలకు తగినట్లుగా పావులు కదుపుతారు అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News