ఓ దేశం కంటే ఈ విమానశ్రయం సైజు పెద్దది.. ఏమది, ఎక్కడది..?
భారతదేశంలోని ముంబై వంటి సిటీ కంటే పెద్దది.. చిన్న చిన్న దేశాల కంటే పెద్దది అయిన విమానాశ్రయం ఒకటి ఉందని తెలుసా?
భారతదేశంలోని ముంబై వంటి సిటీ కంటే పెద్దది.. చిన్న చిన్న దేశాల కంటే పెద్దది అయిన విమానాశ్రయం ఒకటి ఉందని తెలుసా? దీని విస్తీర్ణం సుమారు 776 చదరపు కిలోమీటర్లు (301 చదరపు మైళ్లు). దీంతో.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా నిలిచింది. దీనికి సంబంధించిన విషయాలు వైరల్ గా ఉంటాయి!
అవును.. సౌదీ అరేబియాలోని దమ్మామ్ లో ఉన్న కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మానవ ఆవిష్కరణ, ఇంజినీరింగ్ నైపుణ్యాలకు అత్యుత్తమ ఉదాహరణగా నిలుస్తుందని చెప్పాలి. ఈ అత్యుత్తమ ఎయిర్ పోర్ట్ 1999లో ప్రారంభమైనప్పటి నుండీ సౌదీ అరేబియాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రదేశాలతో అనుసంధానించడంలో కీలక భూమిక పోషిస్తుంది.
ఏటా మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న ఈ విమానాశ్రయం విస్తీర్ణం మూడు ఎయిర్ పోర్ట్స్ ఉన్న బెహ్రాన్ దేశం (760 చదరపు కిలోమీటర్లు) కంటే పెద్దది. ఇదే క్రమంలో... ముంబై సిటీ కంటే కూడా పెద్దది కావడం గమనార్హం. నివేదికల ప్రకారం ముంబై మొత్తం సుమారు 603 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.
ఇక ఈ విమానాశ్రయంలో అత్యాధునిక సౌకర్యాలు, అద్భుతమైన మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. ఇక దీని టెర్మినల్ కాంప్లెక్స్ లో డ్యూటీ ఫ్రీ షాపులు, లాంజ్ లు, రెస్టారెంట్ లు, ప్రేయర్ హౌస్ లు మొదలైన సౌకర్యాలు ఉంటాయి. ఇక ఈ కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి ఉన్న అత్యంత ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి దాని అద్భుతమైన కంట్రోల్ టవర్ అని చెప్పుకోవాలి.
ఈ కంట్రోల్ టవర్ 80 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లలో ఒకటిగా నిలిచింది. ఇక ఈ ఎయిర్ పోర్ట్ రన్ వే వ్యవస్థలో రెండు సమాతరమైన రన్ వేలు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటీ 4,000 మీటర్లు కంటే ఎక్కువ పొడవు కలిగి ఉన్నాయి. ఫలితంగా... రద్దీ సమయాల్లో కూడా ఇది సాఫీగా కార్యకాలాపాలు నిర్వహించగలుగుతుంది.
ఇదే క్రమంలో... కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దాని ప్రయాణికుల టెర్మినల్స్ తో పాటు పెద్ద కార్గో ఆఫ్రాన్ లు, గోడౌన్లు, లాజిస్టిక్స్ కేంద్రాలతో సహా ప్రత్యేక కార్గో సౌకర్యాలను కలిగి ఉంది. ఈ సంస్థలు వాయు రవాణా సేవలకు పెరుగుతున్న డిమాండ్ ను తీరుస్తున్నాయి. ఈ రకంగా పరిమాణంలోనే కాకుండా అన్ని విషయాల్లోనూ ఈ ఎయిర్ పోర్ట్ ఫస్ట్ ప్లేస్ లో ఉందని అంటున్నారు!