హతఃవిధీ... తెలంగాణ మందు బాబులకు కొత్త కష్టం!

ఇందులో భాగంగా... తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కు సరఫరాను తక్షణమే కింగ్ ఫిషర్ బీర్ ను తయారు చేసే యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటించింది.

Update: 2025-01-08 13:44 GMT

తెలంగాణలో మద్యపాన ప్రియులకు కొత్త కష్టం వచ్చి పడింది. ప్రధానంగా.. ఇది బీరు ప్రియులకు చాలా చేదు వార్త అనే చెప్పాలి. రాత్రి పూట చలి పులి వణికుస్తున్నా.. పగలు మాత్రం ఎండలు మండిపోతున్న వేళ మద్యపాన ప్రియులకు ఉపశమనంగా ఉంటుందని చెప్పే బీరు సరఫరా వ్యవహారం షాకింగ్ టర్న్ తీసుకుంది.

అవును... తెలంగాణలో బీర్ల సరఫరా వ్యవహారం ఊహించని మలుపు తీసుకుంది! ఇందులో భాగంగా... తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కు సరఫరాను తక్షణమే కింగ్ ఫిషర్ బీర్ ను తయారు చేసే యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన లేఖను సెబీకి రాసింది.

ఇందులో భాగంగా... తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) 2019 నుంచి ధరలను సవరించకపోవడం వల్ల తమ కంపెనీకి భారీగా నష్టాలు వచ్చాయని.. గత ఐదేళ్లుగా ధరలు పెంచని కారణంగా కంపెనీ ఆదాయంలో భారీ తగ్గుదల నమోదైందని యునైటెడ్ బ్రువరీస్ రాసిన లేఖలో పేర్కొంది.

ఇదే సమయంలో టీజీబీసీఎల్ గత సరఫరాలకు సంబంధించిన బకాయిలు కుడా చెల్లించలేదని.. ఈ ఓవర్ డ్యూ బకాయిలు పరిష్కరించకుండా ముందుకు కొనసాగడం సాధ్యం కాదని.. అందుకే బీర్ల సరఫరాను నిలిపివేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో... ఈ నిర్ణయం తెలంగాణలో బీర్ల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు.

అందుకు కారణం... తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం బీర్ల విక్రయాల్లో 60 శాతానికి పైగా యునైటెడ్ బ్రూవరీస్ ఉత్పత్తులే అని అంటున్నారు. ఇందులో భాగంగా... కింగ్ ఫిషర్, కింగ్ ఫిషర్ ఆల్ట్రా, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, హెయిన్ కీన్ లతో పాటు తెలంగాణలో ప్రజాదరణ పొందిన మొత్తం ఏడు రకాల బీర్లను యూబీ తయారు చేస్తుందని అంటున్నారు.

ఇప్పుడు ఇవన్నీ తెలంగాణలో నిలిచిపోనున్నాయి. మరి.. యునైటెడ్ బ్రూవరీస్ తాజా షాకింగ్ నిర్ణయంపై తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News