‘నాకు అమ్మాయిల పిచ్చివుంది’ కిరణ్ రాయల్ ఆడియో లీక్...
తిరుపతి జనసేన ఇన్ చార్జి కిరణ్ రాయల్ పై మరో వివాదాస్పద ఆడియో బయటకొచ్చింది. కిరణ్ రాయల్ ఓ మహిళతో మాట్లాడుతున్న ఆడియోలో సంచలన విషయాలు ఉన్నాయి.
తిరుపతి జనసేన ఇన్ చార్జి కిరణ్ రాయల్ పై మరో వివాదాస్పద ఆడియో బయటకొచ్చింది. కిరణ్ రాయల్ ఓ మహిళతో మాట్లాడుతున్న ఆడియోలో సంచలన విషయాలు ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవితంతోపాటు పార్టీపైన కిరణ్ రాయల్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఆడియోలో మాట్లాడిన వ్యక్తి తాను కాదంటూ కిరణ్ రాయల్ చెబుతున్నారు. తన వద్ద అలాంటి ఆడియోలు ఉన్నాయని, ఇలాంటి బ్లాక్ మెయిలింగులకు భయపడనంటూ కిరణ్ రాయల్ చెబుతున్నారు.
తిరుపతికి చెందిన ఓ మహిళతో జనసేన నేత కిరణ్ రాయల్ కు ఆర్థిక సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తన వద్ద డబ్బు తీసుకుని కిరణ్ రాయల్ మోసంచేశాడంటూ తిరుపతికి చెందిన లక్ష్మిరెడ్డి వీడియో రిలీజ్ చేశారు. ఈ వ్యవహారంలో కిరణ్ రాయల్ పై అనేక విమర్శలు రావడంతో జనసేన పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించింది. అదే సమయంలో కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిరెడ్డిని ఓ చీటింగ్ కేసులో రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ పై బయటకు వచ్చిన ఆమె మళ్లీ తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇక ఓ కిరణ్ రాయల్ తో ఓ ఆడియో సంభాషణను రిలీజ్ చేశారంటున్నారు. ఈ ఆడియో టేప్ ఇప్పుడు సోషల్ మీడియాల వైరల్ అవుతోంది.
కిరణ్ రాయల్ ఓ మహిళతో మాట్లాడుతున్న ఆడియోలో తనకు అమ్మాయిల పిచ్చి ఉందని చెప్పడం చర్చనీయాంశమవుతోంది. నిజంగా ఆ అడియోలో ఉన్నది కిరణ్ రాయలా? కాదా? అనేది తేలాల్సివుంది. ఆ ఆడియోలో ఏముందంటే.. ‘‘ముసుగులో గుద్దలాటలు వద్దు. నేను మారను. నా క్యారెక్టర్ ఇంతే. నేను లైఫ్ లాంగ్ అలాగే ఉంటాను. నా క్యారెక్టర్ అంతే. నేను చాలా మంది అమ్మాయిలతో పోతా... నా పిచ్చి అది. నేను నీ డబ్బు ఉంచుకోను. నాకు సీటు లేదు అని చెప్పేశారు. ఎన్నికల్లో పోటీకి రూ.20 కోట్లు కావాలని చెప్పారు. నాకు అంత డబ్బు లేదు. టీడీపీకి సీటు ఇచ్చేశారు. ఎలక్షన్ అయితే ఏదో నామినేడెట్ పోస్టు అడుగుతాను. నేను రిలాక్స్ ఇప్పుడు. అప్పుడప్పుడు ఏదో లైవ్లు ఇచ్చుకుంటాను. నేను మారనంటే మారను. నాకు అమ్మాయిల పిచ్చి ఉంది. అదేదో సినిమాలాగా.. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. ఆ విషయం నాకు తెలుసు. నేను కాదనను. కానీ నేను అలా చేయలేను. ఎందుకంటే నేను అందరినీ ప్రేమిస్తుంటాను. ఈ బ్లాక్ మెయిల్, బెదిరింపులు చేయకు. బ్లాక్ మెయిల్ వల్ల లాభం ఏంటి? నీకు డబ్బులు ఇవ్వాలి. ఇస్తా.. నువ్వు ఎంత దిగజారిపోయావు. నీకు అంత ఓవర్ యాక్షన్ ఎందుకు? నువ్వు వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు నాకు బాధ వచ్చింది. నేను ముందులాగా కోపిష్టిని కాను. నువ్వు నాతో మాట్లాడి ఉండాలి.’’ అంటూ కిరణ్ రాయల్ గా అనుమానిస్తున్న వ్యక్తి మాటలు ఉన్నాయి.
అయితే ఈ అడియో టేప్ లో ఉన్నది తాను కాదంటూ కిరణ్ రాయల్ చెబుతున్నారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడను అంటున్నారు. ఇక ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఈ ఇష్యూను రాజకీయంగా హైలెట్ చేస్తోంది. మహిళలను మోసం చేసిన వ్యక్తిని పార్టీలో ఉంచుకున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ ఏం సమాధానం చెబుతారంటూ నిలదీస్తోంది. మరోవైపు కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేస్తున్న మహిళ లక్ష్మి రెడ్డి సైతం తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తక్షణం తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో కిరణ్ రాయల్ వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. ఇక తాజాగా బయటపడిన ఆడియో నిజమైనదా? కాదా? అనేది పోలీసులు తేల్చాల్సివుందని అంటున్నారు. ఏదిఏమైనా కిరణ్ రాయల్ తన నిర్దోషిత్వాన్ని తానే నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో చిక్కుకున్నారని టాక్ వినిపిస్తోంది.