తెలంగాణ అభివృద్ధి పై శ్వేత పత్రం !
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. అభివృద్ధిపై ఆయన శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల దాడి చేస్తున్నారు తప్ప.. వాస్తవాలను మాత్రం ఆయన చెప్పడం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. అభివృద్ధిపై ఆయన శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ నిలువరించలేదని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ను ఇంటికి పంపించాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
బీజేపీ పోలింగ్‌బూత్, ముఖ్య కార్యకర్తల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత పదేళ్లకాలంలో కేసీఆర్ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. కేవలం వారి కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని , వారు మాత్రమే ఆనందంగా ఉన్నారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. యువతకు ఉద్యోగాలు లేవన్నారు.
పేదప్రజలకు రేషన్‌కార్డులు ఇవ్వలేదని, డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకుండా మోసం చేశారని కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు జరిగింది ఏమీలేదన్నారు. పైగా నిర్బంధాలు, నిరంకుశత్వాలు పెరిగిపోయాయన్నారు.
ప్రజాప్రభుత్వం రావాలని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కోసం మనమంతా కృషి చేయాలన్నారు. రాబోయే నలభై రోజుల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల మద్దతు కూడగట్టాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం ప్రతినాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేయాల ని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. అధికారంలోకి వచ్చాక అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని, తెలంగాణ అభివృద్ధి తమ అజెండా అని కిషణ్‌రెడ్డి చెప్పుకొచ్చారు.