కొక్కొరొక్కో... సంక్రాంతి పందేనికి వేళయింది !
కోడి కూతతో పల్లెలు లేస్తాయి. గతంలో చూస్తే గడియారాలు కంటే కూడా కోడి కూతకే ఎక్కువ విలువ.
కోడి కూతతో పల్లెలు లేస్తాయి. గతంలో చూస్తే గడియారాలు కంటే కూడా కోడి కూతకే ఎక్కువ విలువ. ఎన్ని వాచీలు వచ్చినా ఎంత కాలం నడచినా కూడా ఈ రోజుకీ కోడి కూతకే చాలా పల్లెలు లేవడం జరుగుతోంది. అంతలా గ్రామీణ ప్రాంతాలు కోడితో తొలి పొద్దుకు ముందు నుంచే అనుబంధాన్ని పెనవేసుకుంటూ వస్తున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాలలో అచ్చమైన తెలుగు పండుగ ఆంగ్ల సంవత్సరంలో వచ్చే మొదటి పెడ్డ పండుగ అయిన సంక్రాంతికి కోడికీ భలే లింక్ ఉంది.
సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడి పందేలకు తెర లేస్తుంది. బరులు గీస్తుంది, పురులు విప్పుకున్న పురుషం అంతా కోడి పందేలలో కనిపిస్తుంది. ఏటా మూడు నాలుగు రోజుల పాటు సాగే ఈ కోడి పందేలు పల్లె సీమలకు కొత్త కళను తెస్తాయి. అంతే కాదు తమిళనాడులో జల్లికట్టు మాదిరిగా సంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ పల్లె ముచ్చట్లు చెబుతారు.
ఎప్పటి మాదిరిగానే 2025 వచ్చేసింది. ఈసారి కూడా పల్లెలన్నీ కోడి పందేల కోసం సిద్ధమవుతున్నాయి. ఎటు చూసినా ఆ సందోహం కనిపిస్తోంది. సంక్రాంతి పండుగకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వారం గడిస్తే ఇక ముంగిట్లో పండుగే.
దాంతో కోడి పందేలకు అంతా రెడీ అవుతోంది. ఎవరి లెవెల్ వారిది ఎవరి స్థాయి వారిది అన్నట్లుగా గొప్పోళ్ల నుంచి సగటు జనాల వరకూ ఏ బరులు గీస్తున్నారు. కోడి పందేలకు తెర లేపుతున్నారు. సంక్రాంతి పండుగ అంటే కోడి పందేలు అన్నది వెంటనే తోస్తుంది. అది లేక పోతే ఇది లేదు అన్నట్లుగా ఉంటుంది.
ఇక గోదావరి జిల్లాలలో కోడి పందేలు ఒక ప్రత్యేకతగా చూడలి, నిజంగా గ్రామీణ వాతావరణం ఈ రోజుకీ అక్కడ పచ్చగా వెచ్చగా ఉంటుంది. అంతే కాదు సంప్రదాయాలు సంస్కృతి కూడా అక్కడ కనిపిస్తంది. దాంతో ఈసారి కోడి పందేలు కోట్ల రూపాయలతో సాగుతున్నాయని అంటున్నారు. కోడి పందేలు కట్టేవారు ఒక ఎత్తు అయితే చూడడానికి వచ్చేవారు మరో ఎత్తు. కార్ల నుంచి సైకిళ్లూ కాలి నడకన కూడా వచ్చి మరీ ఈ పందేలను చూస్తారు. దాంతో సంక్రాంతి పండుగ తిరునాళ్ళనే తలపిస్తుంది.
వేలాదిగా జనాలు కోడి పందేలా బరుల వద్దకు చేరుతారు అంటే అతి పెద్ద వేడుక ఎలాంటితో మరి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఆరేడు నెలల బట్టి కూడా సంక్రాంతి కోడిని పందెం కోడిని రెడీ చేస్తారు. దానికి ఎంతో పౌష్టికమైన అహారాన్ని కూడా అందిస్తారు.
దానికి మామూలుగా శిస్క్షణ ఇచ్చి బరులలోకి వదలరు. ఎంతో కసరత్తు చేయిస్తారు. ఒక విధంగా చెప్పాలీ అంటే పందెం కోడి అంటే మల్ల యోధుడికి ఏ మాత్రం తీసిపోదు అని చెప్పాల్సిందే. గెలిచిన కోడి అంటే దానికి వచ్చే ఖ్యాతి అపారంగా ఉంటుంది. దానిని ఒక మహరాజుగా చేసి ఊరిలో ఊరేగింపు చేస్తారు. ఇక దానిని పెంచిన ఆసామికి ఏదో రాజ పదవి దక్కినంట్లే ఫీల్ అవుతాడు.
ఈసారి కోడి పందేలకు అంతా సిద్ధం అయిపోతోంది. గోదావరి జిల్లాలలో హొటళ్ళు అడ్వన్స్ బుకింగ్ తో హౌస్ ఫుల్ అయిపోయాయి. నాలుగు రోజుల పాటు గోదావరి ఏరియాలో విడిది చేయడానికి డబ్బున్న మారాజులు అంతా తరలి వస్తున్నారు. దాంతో ఈ సంక్రాంతి సరికొత్తగా గతంలో లేని విధంగా చేసుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక సంక్రాంతి వేళ కోడి పందేలు బరులతో పాటు మందూఒ ముక్కా అన్నీ కూడా ఉండాల్సిందే. దాంతో దేని బిజినెస్ దానిదే అన్నట్లుగా కోట్ల రూపాయలు అలా ఏరులై పారుతాయి. మొత్తానికి చూస్తే గోదావరి సంక్రాంతి ఒక స్పెషల్ గానే చెప్పాలి.
గోదావరి చల్లంగా పారుతూ ఇవన్నీ గమనిస్తుంది. పల్లె మేలుకొలుపుని చూస్తుంది. ఒళ్ళు విరుపుని చూస్తుంది. కోడి పందేలలో రోషాని పౌరుషాన్ని చూస్తుంది. అన్నీ చూస్తూ ఇదే మన సంప్రదాయం అని చెబుతుంది. పెద్ద పండుగకు ఎపుడూ గోదావరి తల్లి చల్లని ఆశీస్సులు ఉంటాయని జనాలు కూడా నమ్ముతారు.ఏది ఏమైనా ఈసారి కూడా శభాష్ అనేలా పందెం కోళ్ళు కాళు దువ్వుతున్నాయి. గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే ఇది ఒక ఆనవాయితీగా వస్తోంది. ఇది మట్టి నేర్పిన కల్చర్ గా భావిస్తూ తరాలు మారినా కొనసాగిస్తూ వస్తున్నరు. సో ఈసారి కూడా అంతా పక్కా రెడీ అని అంటున్నారు.