కోకాపేటపై అంత క్రేజీ ఎందుకు? ఎందుకు ఎగబడి కొంటున్నారు?
హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. రోజురోజుకు ఆకాశ హర్మ్యాలను తలపిస్తూ నిర్మాణాలు చేపడుతోంది.
హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. రోజురోజుకు ఆకాశ హర్మ్యాలను తలపిస్తూ నిర్మాణాలు చేపడుతోంది. ఇందులో భాగంగా భవన నిర్మాణాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఒకరిని మించి మరొకరు పోటీ పడుతూ భవన నిర్మాణాలు నిర్మిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటున్న తరుణంలో భవన నిర్మాణాలు కూడా విస్తరిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే హైదరాబాద్ నగరం మరింత డెవలప్ మెంట్ చోటుచేసుకుంటోంది.
కొత్త కొత్త డిజైన్లతో భవన నిర్మాణాలు చేపడుతున్నారు. డిజైన్లు, స్థలం ఎంపికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధాన కేంద్రాల్లో భవన నిర్మాణాలు నిర్మించుకునేందుకు పోటీ పడుతున్నారు. దీంతో బిల్డర్లకు మంచి డిమాండ్ పెరిగింది. డిజైన్లలో కొత్త రకం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతవరకు ఎవరు నిర్మించని మోడళ్లో కట్టాలని భావిస్తున్నారు.
నగరంలో కోకాపేట అత్యంత విలువైన ప్రాంతం. ప్రస్తుతం ఇక్కడ భూముల ధరలకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో అందరు కోకాపేటలో ఇల్లు నిర్మించుకోవాలని తహతహలాడుతున్నారు. ఇక్కడ ప్రస్తుతం 59 అంతస్తులతో పుప్పాల్ గూడలో క్యాండూర్ స్కైలెన్, 58 అంతస్తులతో సాస్ క్రౌన్ పేరుతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంత భారీ స్థాయిలో భవనాలు నిర్మిస్తుండటంతో ఆకాశాన్ని తాకుతున్నాయా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
ఇప్పుడు ఏకంగా 63 అంతస్తుల భవనాలు నిర్మించేందుకు అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. ఇలా రోజురోజుకు అంతస్తులు పెరిగిపోతుంటే భాగ్యనగరం కాస్త మెట్రోపాలిటన్ నగరంగా ఖ్యాతి చెందుతోంది. విదేశాల్లో భవనాలను చూసి ఆశ్చర్యపోయే మనం ఇక ఇక్కడే అంత పెద్ద భవనాలను చూసి నిర్ఘాంతపోవాల్సి వస్తుందేమోననే సందేహాలు వస్తున్నాయి.
భాగ్యనగరం ఇప్పుడు ఎంతో వేగంగా డెవలప్ మెంట్ అవుతోంది. ఎటు చూసినా భవనాలే దర్శనమిస్తున్నాయి. సిటీ ఔటర్ ప్రాంతం కూడా భవన నిర్మాణాలతో కనిపిస్తోంది. దీంతో హైదరాబాద్ భవిష్యత్ లో మరింత పెద్ద నగరంగా మారే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మన హైదరాబాద్ లో ఎటు చూసినా ఆకాశాన్ని తాకే బిల్డింగులే కనిపిస్తాయని అంటున్నారు.