కాంట్రవర్సీ కొలికపూడి: ఇప్పటికైతే ఓకే.. ఇక ముందు కష్టం..!
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్‌గా ముద్రవేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కాంట్రవర్సీ నాయకు డు కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం ప్రస్తుతానికి సర్దు మణిగింది.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్‌గా ముద్రవేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న కాంట్రవర్సీ నాయకు డు కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం ప్రస్తుతానికి సర్దు మణిగింది. ఆయనను నేరుగా పార్టీ కేంద్ర కార్యా లయానికి పిలిచిన అధిష్టానం.. ద్వితీయ శ్రేణి అగ్రనేతలతో చర్చలు జరిపేలా చేసింది. పల్లా శ్రీనివాస రావు, వర్ల రామయ్య, మంతెన రామరాజు వంటివారితో జరిగిన చర్చల్లో కొలికపూడికి గట్టిగానే సంకేతాలు పంపించారు. ప్రధానంగా రెండు కీలక విషయాలపై చర్చించారు.
1) కేడర్‌ను పక్కన పెట్టడం: ఎన్నికల సమయంలో పొరుగు జిల్లా నుంచి తీసుకువచ్చిన కొలికపూడికి.. చంద్రబాబు తిరువూరులో అవకాశం ఇచ్చారు. కూటమి ప్రభావంతో ఆయన కొట్టుకు వచ్చారు. నిజానికి ఎన్నికల ప్రచారం చూస్తే.. పట్టుమని 100 మంది కూడా ఆయన ప్రచారానికి రాలేదు. కానీ, క్షేత్రస్థాయిలో కేడర్‌ను పురమాయించి.. ఇంటింటి ప్రచారం చేసి.. విజయందక్కేలా చేశారు. కానీ, ఆయన ఎమ్మెల్యే అయ్యాక..అ దే కేడర్‌ను పక్కన పెట్టారు.
ఈ విషయంపై పార్టీ నేతలు ఫైరయ్యారు. మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు అంటూ.. వ్యాఖ్యానించి.. కొలికపూడికి గట్టిగానే సమాధానం చెప్పారు. ఇక, 2) ఎంపీ కేశినేని చిన్నితో వివాదం. ఈ విషయాన్నే అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి నిధులు ఇచ్చి.. గెలిచేలా సహకరించిన కేశినేని చిన్నిని పూచిక పుల్లను తీసి పారేసినట్టు కొలికపూడి వ్యాఖ్యానించారు. దీనిపై పార్టీ నేతలు తీవ్రంగా ఫైరయ్యారు. ఇకపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఇక, తాజాగా కూడా ఆయన నియోజకవర్గంలో కేడర్ సహా ఎంపీ, ఇంచార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై వారంతా చర్చించారు. మహిళల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. పార్టీకి చెడ్డపేరు తెస్తే.. చంద్రబాబు ఇకపై చెప్పేది ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. దీనికి కొలికపూడి తలాడించారు. ఫలితంగాప్రస్తుతానికి తిరువూరు వివాదం .. కాంట్రవర్సీ కొలికపూడి వివాదం సమసిపో యాయి. అయితే.. ఆయన వ్యక్తిగతంగానే ఫైర్ బ్రాండ్ కావడంతో ఏమేరకు పార్టీకి సహకరిస్తారనేది చూడాలి.