కోల్ కతాలోని డాక్టర్ కేసులో సీబీఐ కీలక నివేదిక!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-09-26 03:48 GMT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా తాలా పోలీస్ స్టేషన్ లో కొన్ని రికార్డ్స్ మార్చబడ్డాయని, మరికొన్ని తప్పుగా రికార్డ్ చేయబడ్డాయని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక కోర్టుకు తెలిపింది.

అవును...కోల్ కతా లోని ఆర్జీ కర్ ఆస్పత్రిలోని ట్రైనీ వైద్యురాలిపై అత్యాచార కేసుకు సంబంధించిన కొన్ని రికార్దులు తాలా పోలీస్ స్టేషన్ లో మార్చబడ్డాయని సీబీఐ.. ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపింది. ఈ సందర్భంగా తాలా స్టేషన్ ఇన్ ఛార్జ్ అభిజిత్ మోండల్, ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ లను జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరింది.

ఈ సందర్భంగా స్పందించిన సీబీఐ... విచారణ సందర్భంగా ఇద్దరు నిందితులను విచారించగా.. తాలా పోలీస్ స్టేషన్ లో ఈ కేసుకు సంబంధించిన కొన్ని తప్పుడు రికార్డులు సృష్టించబడ్డాయని.. లేదా, మార్చబడినట్లు చూపే కొన్ని వాస్తవాలు వెలువడ్డాయని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. కోర్టుకు తెలిపింది.

ఇదే సమయంలో... ఆ పోలీస్ స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నామని చెప్పిన సీబీఐ... వాటిని పరీక్ష నిమిత్తం కోల్ కతాలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (సీ.ఎఫ్.ఎస్.ఎల్)కు పంపామని కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా స్పందించిన సీబీఐ న్యాయవాది.. కోర్టుకు కొన్ని విజ్ఞాపణలు చేశారు.

ఇందులో భాగంగా... తమకు సమయం కావాలని.. వారి మొబైల్ ఫోన్ లను, సీసీటీవీ ఫుటేజ్ ల నుంచి డేటా బేస్ ను సేకరించినట్లు తెలిపారు. అయితే... తాము ఇంకా ఆధారాలు సేకరించాలని, దానికి సమయం పడుతుందని.. అందుకు సెప్టెంబరు 30 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.

దీంతో... సీబీఐ అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. తాలా స్టేషన్ ఇన్ ఛార్జ్ అభిజిత్ మోండల్, ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ లను సెప్టెంబరు 30 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

Tags:    

Similar News