'పుష్ప'ను వెంటాడుతున్న కోమటిరెడ్డి... తెరపైకి చిరంజీవి టాపిక్!

ఈ సందర్భంగా దీనిపై స్పందించిన కోమటిరెడ్డి.. అసెంబ్లీ వెలుపలా "పుష్ప"ని వెంటాడుతున్నట్లునారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Update: 2024-12-22 11:56 GMT

తెలంగాణ అసెంబ్లీలో శనివారం రోజు "పుష్ప-2" బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై సంచలన చర్చ జరిగిన నేపథ్యంలో... అక్బరుద్ధీన్ లేవనెత్తడం, రేవంత్ రెడ్డి విచురుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దీనిపై స్పందించిన కోమటిరెడ్డి.. అసెంబ్లీ వెలుపలా "పుష్ప"ని వెంటాడుతున్నట్లునారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యల అనంతరం స్పందించి కీలక వ్యాఖ్యలు చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. దాని కొనసాగింపుగా అన్నట్లుగా శ్రీతేజ్ ను పరామర్శించిన తర్వాత.. అనంతర తాజాగా మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలు ప్రస్థావించారు. ఈ సందర్భంగా చిరంజీవి టాపిక్ కూడా తెరపైకి తెచ్చారు.

ఇందులో భాగంగా... అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల అనంతరం, అదే రోజు మీడియా ముందుకు వచ్చిన అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపైనా కోమటిరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా.. అల్లు అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ ను దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడటం సరికాదని అన్నారు.

ఇంత జరిగాక కూడా తాను ఏ తప్పూ చేయలేదని అల్లు అర్జున్ అనడం సరికాదని చెప్పిన కోమటిరెడ్డి... అంటే సీఎం అసెంబ్లీలో మాట్లాడింది అబద్ధమా..? అని ప్రశ్నించారు. పోలీసుల నుంచి సమాచారం అంతా తీసుకున్న తర్వాతే సీఎం అసెంబ్లీలో మాట్లాడారని.. సీఎం మాట్లాడిన వాటిని కూడా అల్లు అర్జున్ తప్పుబడతారా అని అన్నారు.

ఇదే సమయంలో... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోలేదని చెప్పడం హాస్యాస్పదం అని చెప్పిన కోమటిరెడ్డి.. అల్లు అర్జున్ సీఎంపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అన్నారు! ఈ సందర్భంగా... అనుమతి లేకుండా అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చారని.. తన వద్ద ఆధారలు ఉన్నాయని తెలిపారు.

అదేవిధగా... ఈ ఘటనను రాజకీయం చేయొద్దని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న శ్రీతేజ్ ను చిరంజీవి వెళ్లి పరామర్శించి ఉండాల్సింది అని చెప్పిన కోమటిరెడ్డి... చిరంజీవి ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించి, రేవతి భర్తకు ధైర్యం చెప్పాల్సిందని అన్నారు!

Tags:    

Similar News