ఎంఎల్ఏ అయోమయంలో ఉన్నారా ?

రాబోయే ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని కోన చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే అసలు టికెట్ వస్తుందా రాదా అనే సందేహాలు కూడా పార్టీలో వ్యక్తమవుతున్నాయి.

Update: 2024-03-07 04:02 GMT

రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ వస్తుందో రాదో అన్న అయోమయం సిట్టింగ్ ఎంఎల్ఏలో పెరిగిపోతున్నట్లుంది. విషయం ఏమిటంటే బాపట్ల వైసీపీ ఎంఎల్ఏ కోన రఘుపతి హ్యాట్రిక్ ఎంఎల్ఏ అనిపించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 2014, 19 ఎన్నికల్లో గెలిచారు. టీడీపీ అభ్యర్ధి అన్నం సతీష్ పైన రెండు సార్లు రఘపతి 5 వేలు, 16 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. రాబోయే ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని కోన చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే అసలు టికెట్ వస్తుందా రాదా అనే సందేహాలు కూడా పార్టీలో వ్యక్తమవుతున్నాయి.

దీనికి కారణం ఏమిటంటే రఘుపతికి బదులుగా తమకు టికెట్ కేటాయించాలని రెడ్డి సామాజికవర్గం నుండి జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే బాపట్ల నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చాలా ఎక్కువ. ఇతర సామాజికవర్గాలు కూడా ఉన్నప్పటికీ రెడ్లదే ఆధిపత్యం. అందుకని రెడ్లకే టికెట్ ఇవ్వాలని 2019లో జగన్ పై బాగా ఒత్తిడి తెచ్చారు. అయితే తనపై రెడ్లు ఎంతగా ఒత్తిడి తెచ్చినా జగన్ మాత్రం పట్టించుకోకుండా కోనకే టికెట్ కేటాయించారు.

కారణం ఏమిటంటే 2014లో గెలిచిన రఘుపతిని టీడీపీలో చేరాలని బాగా ఒత్తిళ్ళు పెట్టారు. అయినా సరే పార్టీ మారేదిలేదని రఘుపతి గట్టిగా నిలబడ్డారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే రఘుపతి కమిట్మెంట్ కారణంగానే జగన్ రెండోసారి టికెట్ ఇచ్చారు. పార్టీ గెలిచిన తర్వాత మంత్రవర్గంలో చోటు దక్కుతుందని ఆశించినా దక్కలేదు. అయినా సరే ఎక్కడా తనలోని అసంతృప్తిని బయటపడనీయకుండా మంత్రిపదవిని పట్టించుకోకుండా తనపనేదో తాను చేసుకుని పోతున్నారు.

అయితే మూడోసారి కూడా టికెట్ తనకే వస్తుందని, హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని రఘుపతి కాన్పిడెన్స్ తో ఉన్నారు. అయితే రెడ్లు మాత్రం బాపట్లలో కొత్త అభ్యర్ధి పోటీచేయటం ఖాయమని బాగా ప్రచారంచేస్తున్నారు. టికెట్ రేసులో గాదె మధుసూధనరెడ్డి, ఆళ్ళరామకృష్ణారెడ్డి, ఎంఎల్సీ అప్పిరెడ్డి, రాజ్యసభ ఎంపీ వైసీ సుబ్బారెడ్డి కొడుకు పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. మరి జగన్ ఏమిచేస్తారనే విషయంలో ఉత్కంఠ పెరిగిపోతోంది.

Tags:    

Similar News